Minister Konda Surekha: వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:23 AM
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి కల్యాణం ఆదివారం ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద అంగరంగ వైభవంగా జరిగింది...
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ
కొమురవెల్లి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి కల్యాణం ఆదివారం ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద అంగరంగ వైభవంగా జరిగింది. దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ కల్యాణానికి హాజరై ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మల్లన్న ఆలయాన్ని కూడా మాస్టర్‌ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తామన్నారు. అమ్మవార్ల స్వర్ణ కిరీటాల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. సిద్దేశ్వరానందగిరి మహారాజ్ స్వామిజీ పర్యవేక్షణలో ఈ కల్యాణ వేడుక జరిగింది.