Share News

ఘనంగా వినాయక నిమజ్జనం

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:52 PM

చెన్నూరు పట్టణం, మండలంలో గణేష్‌ నిమజ్జన ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. మంగళవాయిద్యాలు, మహిళల కోలాటం, యువతీయువకుల నృత్యాల న డుమ శోభాయాత్రను కన్నుల పండగగా నిర్వహించారు. గాంధీ చౌక్‌లో ఏర్పాటు చేసిన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథులకు ఘనంగా స్వాగతం పలి కారు.

ఘనంగా వినాయక నిమజ్జనం
చెన్నూరులో గణనాథుల శోభాయాత్ర

చెన్నూరు, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు పట్టణం, మండలంలో గణేష్‌ నిమజ్జన ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. మంగళవాయిద్యాలు, మహిళల కోలాటం, యువతీయువకుల నృత్యాల న డుమ శోభాయాత్రను కన్నుల పండగగా నిర్వహించారు. గాంధీ చౌక్‌లో ఏర్పాటు చేసిన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథులకు ఘనంగా స్వాగతం పలి కారు. అనంతరం పెద్దచెరువులో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘట నలు జరగకుండా జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వ ర్‌ ఆధ్వర్యంలో చెన్నూరు సీఐ దేవేంద ర్‌రావు, రూరల్‌ సీఐ బన్సీలాల్‌లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దండేపల్లి : మండలంలోని పలు గ్రా మాల్లోని గణనాథులను శోభాయాత్రగా తీ సుకేళ్లి గూడెం, ద్వారక గోదావరి నదిలో గ ణనాథులను నిమజ్జనం చేశారు. మహిళలు నృత్యాలు చేస్తూ అలరించారు.

కోటపల్లి : మండల కేంద్రంలో 9 రోజు ల పాటు పూజలందుకున్న గణనాథులను గురువారం గంగమ్మ ఒడికి నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన ఉత్సవాలను అత్యం త వైభవంగా జరిపారు. ఎలాంటి అవాంచ నీయ సంఘటనలు జరగకుండా పోలీసు లు బందోబస్తు నిర్వహించగా విగ్రహాలతో శోబాయాత్ర నిర్వహించి స్థానిక పెద్దచెరు వులో నిమజ్జనం చేశారు.

Updated Date - Sep 04 , 2025 | 11:52 PM