kumaram bheem asifabad-జిల్లాలో ఘనంగా పొలాల పండగ
ABN , Publish Date - Aug 23 , 2025 | 10:56 PM
జిల్లా వ్యాప్తంగా శనివారం పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహిచారు. జిల్లా కేంద్రంలో రైతులు పొలం పనులు పూర్తి అయిన నేపథ్యంలో ఎడ్లకు ప్రత్యేకంగా అలంకరించి ఆలయాల వద్దకు తీసుకెళ్లారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఎక్కువగా కనిపించే ఈ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సాయంత్రం అందంగా అలంకరించిన ఎడ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శనివారం పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహిచారు. జిల్లా కేంద్రంలో రైతులు పొలం పనులు పూర్తి అయిన నేపథ్యంలో ఎడ్లకు ప్రత్యేకంగా అలంకరించి ఆలయాల వద్దకు తీసుకెళ్లారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఎక్కువగా కనిపించే ఈ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సాయంత్రం అందంగా అలంకరించిన ఎడ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎంపీపీ బాలేష్‌గౌడ్, నాయకులు చరణ్, మల్లేష్, రమేష్, మారుతి, అరిగెల నాగేశ్వర్‌రావు, విశాల్‌లు ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. కుమరం భీం చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీచౌక్ వద్ద గల అంకమ్మరాజు ఆలయం వరకు సాగింది. అంకమరాజు ఆలయం వద్ద ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్ అహ్మద్, నాయకులు సరస్వతి, నాయకులు వెంకన్నలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీలో పాల్గొనడం దానిని చూడడానికి ప్రలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. స్థానిక సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో బందో బస్తు ఏర్పాటు చేశారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలో శనివారం పొలాల అమావాస్య పండగను రైతులు, పట్టణవాసులు ఘనంగా నిర్వహించారు. సిర్పూరు ఎమ్మెల్యే హరీష్ బాబు తన నివాసంలో ఆవుకు పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలో శనివారం పొలాల అవావాస్య పండగను ఘనంగా జరుపుకున్నారు. రైతులు పశువులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో గ్రామ దేవతల ఆలయాల చుట్టూ పశువులతో ప్రదక్షిణ నిర్వహించి నైవేద్యం సమర్పించారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండలంలో పొలాల అమావాస్య పండుగను శనివారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే రైతులు ఎద్దులను శుభ్రంగా కడిగి అలంకరించారు. సాయంత్రం మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద బసవన్నలను ప్రదక్షిణలు చే యించి ప్రత్యేక పూజలు జరిపారు. శ్రావణ మాసం ఉపవాసలతో ఉన్న రైతులు సాయత్రం తమ ఇళ్ల వద్ద ఎద్దులకు ప్రత్యేక పూజలు జరిపి ఉపవాసాన్ని విరమించారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): పొలాల పండగ ఆనందోత్సవాన్ని కలిగిస్తుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలో పొలాల పండగ సందర్భంగా టోంకిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.. అనంతరం టోంకిని గ్రామంలో గ్రామంలో పశువుల శోభాయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లావణ్య, సాయి, శంకర్, సత్యనారాయణ, ప్రశాంత్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండలంలోని పొలాల అమావాస్య పండగను జరుపుకున్నారు. వ్యవసాయ పనుల పూర్తి అయిన తరువాత బసవన్నలను పూజించడం ఈ ప్రాంత అనవాయితీ. మహారాష్ట్ర సంస్కృతిని పోలి ఉన్న పొలాల అమావాస్య పండగను ఈ ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తారు. పశువులను ప్రత్యేకంగా అలంకరించి ఆలయాల చుట్టు ప్రదక్షిణలు నిర్వహించారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండలంలోని రైతులు పొలాల పండగను వైభవంగా నిర్వహించారు. రైతులు పశువులకు పూజలు నిర్వహించి ఆయా గ్రామాల్లో గ్రామ దేవతల ఆలయాల చుట్టు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం నైవేద్యాన్ని సమర్పించారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలో పొలాల పండగను ఘనంగా జరుపుకున్నారు. రైతులు ఎడ్లకు పూజలు నిర్వహించి ఆయా గ్రామాల్లో గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా పొలాల పండగను ఘనంగా జరుపుకున్నారు. పశువులను సమీప వాగులో, చెరువుల్లో శుభ్రం చేసి రంగులతో అలంక రించారు. అనంతరం సమీపంలో ఆలయాల చుట్టు ప్రదక్షణలు నిర్వహించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.