Share News

ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:26 PM

: మార్కెట్‌ వచ్చిన ధాన్యా న్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్‌, సెప్టెంబరు 3 (ఆంధజ్యోతి) : మార్కెట్‌ వచ్చిన ధాన్యా న్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. బుధ వారం పట్టణంలో వ్యవసాయ మార్కెట్‌ లోని సమావేశం హాల్‌లో మార్కెట్‌ చైర్మ న్‌ రజిత అధ్యక్షతన పాలకమండలి స భ్యుల సర్వసభ్య సమావేశం నిర్వహిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అచ్చంపేట వ్యవసాయ మార్కె ట్‌ను మరింతగా అభివృద్ధి చేయడానికి వ్యవసా య మంత్రిని కలుస్తామన్నారు. మార్కెట్‌కు వ చ్చే ఽధాన్యాన్ని నిల్వ ఉంచకుండా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ మార్కెట్‌లో అన్ని వసతులు కల్పించాలని సూ చించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టి కి తీసుకురావాలని ఎమ్మెల్యే వారికి సూచిం చారు. కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, మల్లేష్‌, మార్కెట్‌ డైరెక్టర్లు, ట్రేడర్స్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 11:26 PM