Share News

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:45 PM

ధాన్యం కొనుగో లు కేంద్రాలను వెంటనే ప్రారం భించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్య క్షుడు పి.శివశంకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
మాట్లాడుతున్న డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.శివశంకర్‌

కోడేరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగో లు కేంద్రాలను వెంటనే ప్రారం భించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్య క్షుడు పి.శివశంకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల పరిధిలోని జనుంపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మా ట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రైతులు 15, 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలకు వడ్లు తరలించి విక్రయం కోసం వేచి చేస్తున్నారని, ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప్పటికీ కొనుగోలు మాత్రం చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక కొనుగోలు అధికారులు కొనుగోలు ప్రా రంభించి ఆ తరువాత కొనుగోలు చేయకపోవ డంతో రైతులు పడికాపులు కాయాల్సి వస్తుం దన్నారు. కార్యక్రమంలో రైతులు మధు, శేఖర్‌, తిరుమలరాజు, మధుకర్‌, తరుణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 11:45 PM