Share News

kumaram bheem asifabad- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Oct 17 , 2025 | 10:22 PM

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, ఏఈవోలు, పీఏసీఎస్‌ కార్యదర్శులు, ఐకేపీ ఏపీఎంలు, సీసీలు, వీఓఏలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు.

kumaram bheem asifabad- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, ఏఈవోలు, పీఏసీఎస్‌ కార్యదర్శులు, ఐకేపీ ఏపీఎంలు, సీసీలు, వీఓఏలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వానాకాలం సీజన్‌ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సంబంధిత శాఖల సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు. జిల్లాలో సుమారు 44 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. దాదాపు 30 వేల టన్నుల ధాన్యంను రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 24 తేదీలోగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 40 కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. వరి ధాన్యం ఏ గ్రేడ్‌ రకానికి క్వింటటాలుకు రూ.2389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధరగా నిర్ణయించారని అన్నారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్‌ అందించడం జరుగు తుందని తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని తేమ శాతం నిబంధనలకు లోబ డి ఉండేలా చూసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చేలా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటి, జిల్లా మార్కెటింగ్‌ అధకారి అశ్వక్‌ అహ్మద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 10:22 PM