ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు...
ABN , Publish Date - May 03 , 2025 | 11:00 PM
అకాల వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వరి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచింది. జిల్లాలో వరి కోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చే రుతుండటంతో రైతులు సైతం ఆందోళనకు గురవుతు న్నారు.
జిల్లాలో 361 కేంద్రాలకుగాను 341 ప్రారంభం
-160 కేంద్రాల ద్వారా 37,730.240 టన్నుల సేకరణ
-వెంట వెంటనే కాంటా, ఆన్‌లైన్‌లో నమోదు
-రైతులకు రూ.15.47 కోట్లు చెల్లింపు
-వర్షాలను దృష్టిలో ఉంచుకుని అధికారుల చర్యలు
మంచిర్యాల, మే 2 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వరి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచింది. జిల్లాలో వరి కోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చే రుతుండటంతో రైతులు సైతం ఆందోళనకు గురవుతు న్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన ధాన్యం కళ్లా ల్లోనే తడిచి ముద్దవుతుందేమోనన్న బెంగ వారిని వెం టాడుతోంది. గతంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆల స్యం కావడంతో వర్షాలు పడి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అఽధికారులు యా సంగి సీజన్‌లో ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అంతే వేగంగా ధాన్యం సేకరణ, నగదు చెల్లింపుల ప్రక్రియలో కూడా స్పీడ్ పెంచారు.
మూడు లక్షల పై చిలుకు దిగుబడి అంచనా...
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి రబీ సీజన్‌లో వరి సాగు జిల్లాలో ఘననీయంగా పెరిగింది. ఈ సీజన్ లో జిల్లాలో లక్షా 21,702 ఎకరాల్లో వరి పంట సాగైం ది. ఇందులో దొడ్డు రకం లక్షా 14,774 ఎకరాలు కాగా, సన్నరకం 6,928 ఎకరాల్లో సాగు చేయగా, 3,40,301 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో దొడ్డు రకం 3,23,639 మెట్రిక్ టన్నులు కాగా, సన్నరకం ధాన్యం 16,662 మెట్రిక్ ట న్నులు వస్తుందని భావిస్తున్నారు.
332 కేంద్రాల ఏర్పాటు...
యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు సంబంధిం చి జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వ ర్యంలో 361 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, శనివారం వరకు 341 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 160 కేం ద్రాలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా 37,730.240 టన్ను ల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి, రూ. 15.47 కోట్లను వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా నిత్యం సగ టున 4 వేల నుంచి 6వేల టన్నులు కాంటా వేస్తుండ గా, దాదాపు 150 పై చిలుకు లారీలు ఏర్పాటు చేసి 3 వేల టన్నుల వరకు ధాన్యాన్ని ఎంపిక చేసిన రైస్ మి ల్లులకు తరలిస్తున్నారు. ధాన్యం నిలువ ఉంచేందుకు మంచిర్యాల జిల్లాలో 16 మిల్లులను ఎంపిక చేయగా, కరీంనగర్ జిల్లాలోని 48 మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారు.
ఇబ్బందికరంగా మారిన టార్ఫాలిన్ల కొరత...
రైతులు ధాన్యం విక్రయించే ముందు ప్రభుత్వం సూ చించిన మేరకు తేమ లేకుండా ఆరబెట్టాల్సి ఉంటుంది. దీంతో కోసిన తరువాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రా లకు తరలించి, అక్కడ మూడు, నాలుగు రోజులపాటు రైతులు ఆరబెడతారు. జిల్లాలో ఆకాల వర్షాల సూచన ఉండటంతో టార్ఫాలిన్‌లతో ధాన్యాన్ని రక్షించుకోవాల్సి న అవసరం ఉంది. కొనుగోలు కేంధ్రాల్లో అందుబాటు లో ఉన్న టార్ఫాలిన్లు ఉపయోగించి, ధాన్యాన్ని రక్షించు కోవాలని అధికారులు సూచిస్తుండగా, సరిపడా టార్ఫా లిన్లు లేక కొంతమేర ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్లాస్టిక్ కవ ర్లు కప్పి ఉంచుతున్నట్లు చెబుతున్నారు. సెంటర్లలో ధాన్యం దిగుబడికి అనుగుణంగా టార్ఫాలిన్లు అందుబా టులో ఉంచితే ఇబ్బందులు పడాల్సి వచ్చేదికాదని అభిప్రాయపడుతున్నారు.
వర్షంతో పొంచి ఉన్న ప్రమాదం....
జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ధా న్యానికి పెద్ద మొత్తంలో ప్రమాధం పొంచి ఉంది. జి ల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ....ఇంకా పూర్తిస్థాయిలో వరికోతలు ముగియలేదు. ఇటీవల బు ధ, గురువారాల్లో కురిసిన అకాల వర్షాలకు పలు మం డలాల్లో చేతిక వచ్చిన పంట నీటిపాలు కాగా, కొనుగో లు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం కూడా తడిసి ముద్దయిం ది. జిల్లాలో 50 సెంటర్ల వరకు వర్ష సూచన ఉందని, జాగ్రత్తగా ఉండాలని రైతులకు అధికారులు ముందస్తు సమాచారం అందించారు. దండేపల్లి, హాజీపూర్, చె న్నూరు, కోటపల్లి, భీమారం, నెన్నెల, వేమనపల్లి, జైపూ ర్ మండలాల్లో వర్ష సూచనపై రైతులతోపాటు, సెంట ర్ల ఇన్‌చార్జిలను సైతం అప్రమత్తం చేశారు. అయినప్పటికీ జరగకూడని నష్టం జరిగిపోయింది. అ కాల వర్షాల కారణంగా నెన్నెల, భీమారం, జైపూర్ మం డలాల్లో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ముఖ్యంగా నెన్నెల మండలంలోని ఆవడం, చిత్తాపూర్, పొట్యాల, చిన్న వెంకటాపూర్, నెన్నెల, గుండ్ల సోమారం, నర్వా యిపేట, గొల్లపల్లి, మైలారం గ్రామాల్లో 177 మంది రై తులకు చెందిన వరి, జొన్న పంట నీటిపాలైంది. ఆయా మండలాల్లోని కోత దశకు వచ్చిన సుమారు 175 ఎక రాల్లోని పంటకు నష్టం వాటిల్లింది.
అన్ని చర్యలూ తీసుకుంటున్నాం....
మోతీలాల్, జిల్లా అదనపు కలెక్టర్
రబీ సీజన్‌కు సంబంధించి దాన్యం కొనుగోలు కేంద్రా ల్లో నిల్వ ఉన్న ధాన్యం అకాల వర్షాలకు తడవకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో వేగం పెంచాం. రైతుల నుంచి వెంట వెం టనే ధాన్యం కొనుగోలు చేసేలా సెంటర్ల సిబ్బందిని ఆదేశించాం. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కూ డా వీలైనంత త్వరగా రైస్ మిల్లులకు తరలించి, నిల్వ చేస్తున్నాం. కేంద్రాల్లో టార్ఫాలిన్లు కూడా అందుబాటు లో ఉంచాము. జిల్లా వ్యాప్తంగా 50 సెంటర్లకు వర్ష సూచన ఉన్నట్లు ముందుగానే అప్రమత్తం చేయడం జరిగింది.