kumaram bheem asifabad- త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:45 PM
త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ అన్నారు. మండలంలో ఐకేపీ ఆద్వర్యంలో చింతలమానేపల్లి, రవీంద్రనగర్‌లో ఏర్పాటు చేస్తుండగా ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాలను ఆదివారం పరిశీలించారు.
చింతలమానేపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ అన్నారు. మండలంలో ఐకేపీ ఆద్వర్యంలో చింతలమానేపల్లి, రవీంద్రనగర్‌లో ఏర్పాటు చేస్తుండగా ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాలను ఆదివారం పరిశీలించారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే అమ్ముకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఆయన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, సీసీలు పద్మ, తిరుపతి, వీఓఏలు హిమాన్‌సర్కార్, స్వప్న ఉన్నారు.
బెజ్జూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని జిల్లా వ్యవసాయ అధికారి బొర్కూట్ వెంకట్ అన్నారు. మండలంలోని బెజ్జూరు, బారేగూడ గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల స్థలాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులతో మాట్లాడారు. సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.500బోనస్ ఇస్తుందని చెప్పారు. రైతులంతా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ధాన్యంలో తేమశాతం తగ్గకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట ఏపీఎం మోహన్‌దాస్, సీసీ రంగయ్య ఉన్నారు.