Share News

Governor J. Kishan Reddy: ఆదర్శవంతమైన నేత వాజ్‌పేయి

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:54 AM

దేశాభివృద్ధికి అవసరమైన కీలక మార్పులు తీసుకొచ్చిన మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి ఆదర్శవంతమైన నేతని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు..

Governor J. Kishan Reddy: ఆదర్శవంతమైన నేత వాజ్‌పేయి

  • కంటోన్మెంట్‌లోని మాజీ ప్రధాని విగ్రహానికి నివాళి

  • ఘనంగా వాజ్‌పేయి 101వ జయంతి

మారేడుపల్లి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : దేశాభివృద్ధికి అవసరమైన కీలక మార్పులు తీసుకొచ్చిన మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి ఆదర్శవంతమైన నేతని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌ పికెట్‌లోని అటల్‌ బిహారి వాజ్‌పేయి పార్కులో ఉన్న వాజ్‌పేయి విగ్రహానికి గవర్నర్‌ గురువారం నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. వాజ్‌పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. భారతదేశ అభివృద్ధికి కీలక మార్పులు తీసుకువచ్చిన స్ఫూర్తి ప్రదాతగా వాజ్‌పేయిని కొనియాడారు. హైదరాబాద్‌లో వాజ్‌పేయి విగ్రహాలు మరిన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్రమంతి జి. కిషన్‌ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ రావు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య్డ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 05:54 AM