Share News

KTR ACB Inquiry: బిగ్ బ్రేకింగ్.. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి

ABN , Publish Date - Nov 20 , 2025 | 10:28 AM

ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి కేటీఆర్‌‌ను విచారించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఏసీబీ త్వరలోనే కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనుంది.

KTR ACB Inquiry: బిగ్ బ్రేకింగ్.. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి
KTR ACB Inquiry

హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌‌ను విచారించడానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఓకే చెప్పారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత చార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. కేటీఆర్‌ ప్రజాప్రతినిధిగా ఉన్నందున్న ఆయనపై చర్యలకు గవర్నర్‌ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సానుకూలంగా స్పందించారు. కేటీఆర్‌పై విచారణకు అనుమతి ఇచ్చారు.


అందుకే గవర్నర్ అనుమతి..

కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్‌పై మీడియాతో మాట్లాడుతూ..‘2018లో ‘ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్‌’ను అమెండ్ చేశారు. ఏ మంత్రి మీద విచారణ చేయలన్నా.. విచారణకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలి. విచారణ తర్వాత ఛార్జ్‌షీట్ వెయ్యాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. విచారణకు ముందు గవర్నర్ అనుమతి తీసుకున్నాం. ఛార్జ్‌షీట్ ఫైల్ చేయడానికి గవర్నర్ ఆమోదం కోసం పంపించాం. 3 నెలలు అవుతున్నా గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ అనుమతి లేకుండా కేటీఆర్‌ను అరెస్ట్ చేసినా.. కేసు పెట్టినా పది నిమిషాలల్లో ఆయనకు బెయిల్ దొరుకుతుంది. కేసు నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

రాణిస్తున్న ఐటీ స్టాక్స్.. దేశీయ సూచీలకు లాభాలు..

చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్

Updated Date - Nov 20 , 2025 | 11:02 AM