Independence Day: ఉల్లాసంగా.. ఉత్సాహంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:50 AM
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన ’ఎట్‌హోం’ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది.
రాజ్‌భవన్‌లో ’ఎట్‌హోం’ కార్యక్రమానికి హాజరైన సీఎం
స్పీకర్, మండలి చైర్మన్ సహా పలువురు ప్రముఖుల హాజరు
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన ’ఎట్‌హోం’ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం సాయంత్రం ఇచ్చిన తేనీటి విందుకు సీఎం రేవంత్ , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, బండారు దత్తాత్రేయ, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె. రాంచందర్ రావు, ఎంపీలు కె. లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
శుక్రవారం గవర్నర్ పుట్టినరోజు కూడా కావటంతో.. సీఎం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ గీతాలాపన అనంతరం అతిథులు తేనీటి విందును స్వీకరించారు. కార్యక్రమానికి వచ్చిన అతిఽథుల వద్దకు గవర్నర్, సీఎం ఇద్దరూ స్వయంగా వెళ్లి పలకరించారు. కాగా, ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నుంచి ఎవరూ హాజరుకాకపోవటం చర్చనీయాంశంగా మారింది.