ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:16 PM
ప్రజా సంక్షేమలో భాగంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం చెన్నూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, రిజిష్టర్ లు, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సంక్షేమలో భాగంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం చెన్నూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, రిజిష్టర్ లు, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్ర జలకు మెరుగైన వైద్య సేవలందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకో వాలన్నారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించాల్సిన జాగ్రత్త లను ప్రజలకు వివరించాలన్నారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచా లని, రోగులకు అందించే ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. అనంతరం ము న్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో కలిసి పట్టణంలో అమృత్ 2.0లో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో కొనసాగుతున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పనులను పూర్తి చే యాలన్నారు. అనంతరం కేజీబీవీ విద్యాలయం పాఠశాల, కళాశాలను సందర్శించి విద్యార్థు లకు అందిస్తున్న ఆహారం నాణ్యత, తరగతగి గదులు, వంటశాల, పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో పాడైన ఆర్‌వో ప్లాంటు స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదే శించారు. అరంతంర ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులకు, 10వ తరగతి విద్యార్థులకు స్వ యంగా పాఠాలను బోధించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్ పాల్గొన్నారు.