సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వాలు విఫలం
ABN , Publish Date - Jun 15 , 2025 | 10:41 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సం క్షేమాల పథకాల అమలులో విఫలం చెందాయని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. సీపీఐ నస్పూర్ మండల 3వ మహా సభ స్థానిక నర్సయ్య భవన్‌లో ఆదివారం జరిగింది.
కగార్ ఆపరేషన్ నిలిపివే సి చర్చలు జరుపాలి...
నస్పూర్ మహాసభలో చాడ వెంకట్‌రెడ్డి
నస్పూర్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సం క్షేమాల పథకాల అమలులో విఫలం చెందాయని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. సీపీఐ నస్పూర్ మండల 3వ మహా సభ స్థానిక నర్సయ్య భవన్‌లో ఆదివారం జరిగింది. అంతకు ముందు గోదావరి కాలనీ షిర్కే సెంటర్ నుంచి నస్పూర్ కాలనీ మీదుగా సీసీసీ కార్నర్ సమీపంలోని నర్సయ్య భవన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నర్సయ్య భవన్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమర వీరులకు పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం జరిగిన మహాసభ సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాలను మరిచి పాలన సాగిస్తు న్నాయన్నారు. అలాగే రాష్ట్ర మహాసభలు ఆగస్టు నెలలో మెడ్చల్‌లో 22, 23 తేదీల్లో జరుగుతాయన్నారు. జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రం చండీ ఘడ్‌లో సెప్టెంబర్‌లో జరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరే షన్‌ను వెంటనే ఆపి వేసి చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కా ర్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. నూతనంగా ఏర్పడిన మున్సిపల్ కా ర్పొరేషన్‌లో అన్ని స్థానాలకు అభ్యర్థులను నిలబెడతామని, నస్పూర్ ప్రాం తంలోనే ప్రజలందరూ ఆదరించాలని కోరారు. ఈ మహాసభలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు ఆహ్వాన సంఘం అధ్యక్షులు మేకల దాసు, నస్పూర్ కార్యదర్శి జోగుల మల్లయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుంట చంద్రశేఖర్, వీరభద్రయ్య, రవి, సమ్మయ్య, బాజీసైదా, చంద్రకళ, కొమురయ్య, ఎండీ అప్రోజ్, దొడ్డిపల్లి రవీందర్, మొగిలి లక్ష్మణ్, పాల్గొన్నారు.