Share News

విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:21 PM

విద్యారంగం బలోపే తా నికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురు వారం భీమారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యా లయాన్ని సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, మధ్యాహ్న భో జనం నాణ్యత, రిజిష్టర్‌లు పరిసరాలను పరిశీలించారు.

విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం కృషి
ఆశ్రమ పాఠశాలలో భోజనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

భీమారం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : విద్యారంగం బలోపే తా నికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురు వారం భీమారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యా లయాన్ని సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, మధ్యాహ్న భో జనం నాణ్యత, రిజిష్టర్‌లు పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యు త్‌, మూత్రశాలలు, ప్రహారీ గోడ, ఇతర మౌలిక సదుపాయాలు క ల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. విద్యార్థు లకు మెను ప్రకారం సకాలంలో భోజనం అందించాలన్నారు. ఉపా ధ్యాయులు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంద ర్శించారు. వార్డులు, మందుల నిల్వలు, ల్యాబ్‌, పరిసరాలను పరిశీలిం చారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, స మయ పాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. అనం తరం ప్రబుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శిం చి సౌకర్యాలను పరిశీలించారు. మెను ప్రకారం భోజనం అందించా లని, పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనులను వేగవంతం చేయాల న్నారు. దాంపూర్‌ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్ధేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో మధుసూదన్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:22 PM