Share News

హామీల అమలుకు ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:15 PM

హామీల అమలుకు ప్ర భుత్వం శక్తివంచన లే కుండా కృషి చేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ, నాగర్‌కర్నూ ల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

హామీల అమలుకు ప్రభుత్వం కృషి
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

కందనూలు, డిసెంబ రు 10 (ఆంధ్రజ్యోతి) : హామీల అమలుకు ప్ర భుత్వం శక్తివంచన లే కుండా కృషి చేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ, నాగర్‌కర్నూ ల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. బుధ వారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడా రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గ్రామాల్లో సర్పంచ్‌లు గా గెలిపిస్తే వారు నేరుగా ప్రభుత్వం, ఎమ్మె ల్యేలతో సమన్వయం చేసుకుని అభివృద్ధికి తోడ్పాటునందిస్తారని వారు పేర్కొన్నారు. తెలం గాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజ లకు ఎంతో మేలు చేకూరుస్తుందని అన్నారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో రూ.40కోట్లతో నూతన ఆసు పత్రికి శంకుస్థాపన చేయనున్నట్లు నాగర్‌క ర్నూల్‌ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి తెలిపారు. జూని యర్‌ కళాశాల, బస్టాండ్‌ పునర్నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించినట్లు రాజేశ్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో గ్రామపంచాయతీలకు నేరుగా రూ.3,500 కోట్లు నిధులు మంజూరు కానున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కావలి శ్రీను, సునీంద్ర మహమ్మద్‌ నిజాము ద్దీన్‌, రేణుబాబు, జక్కా రాజ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 11:15 PM