Share News

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే

ABN , Publish Date - Nov 15 , 2025 | 10:58 PM

రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని క ల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే
జూపల్లిలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి/ చారకొండ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి : రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని క ల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం మండలం లోని జూపల్లి గ్రామంలో సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరికొనుగోలు కేంద్రాన్ని జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఠాగూర్‌ బాలాజీ సింగ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతులు తమ పం టలను దళారులకు విక్రయించకుండా ప్రభు త్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించి, మద్దతు ధర పొందాలని అన్నారు. కార్యక్రమం లో పీఏసీఎస్‌ చైర్మన్‌ జెల్ల గురువయ్యగౌడ్‌, త హసీల్దార్‌ఉమ, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ముస్త ఫా, డీసీసీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య యాదవ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బాలరాంగౌడ్‌, డీ సీసీ ప్రధాన కార్యదర్శి బాలరాజు, ఏఈవో జ్యో తి, సింగిల్‌విండో ఇన్‌చార్జి సీఈవో భీమయ్యగౌ డ్‌, ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు శివ, వెంకటయ్యగౌడ్‌, సాంబయ్యగౌడ్‌, నర్సింహారెడ్డి, నూరుపాల్‌నాయక్‌, రాములుయాదవ్‌, బొజ్జ య్య, మల్లేష్‌, రైతులు పాల్గొన్నారు.

ఫ కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామంలో పోలేమోని అనిత, శంకర్‌ల ఇందిరమ్మ ఇంటిని జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఠాకూర్‌ బాలాజీసింగ్‌ తో కలిసి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ప్రా రంభించారు. కల్వకుర్తిలోని రైతువేదికలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేం ద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎంజేపీ బాలుర గురుకులాన్ని ఎమ్మెల్యే సంద ర్శించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ మా నిటరింగ్‌ కమిటీ సభ్యులు జిల్లెల రాములు, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కు మార్‌, మార్కెట్‌ చైర్మన్‌ ఉమా మనీలా సంజీవ్‌ కుమార్‌యాదవ్‌, మార్కెట్‌ డైరెక్టర్లు పసుల రమాకాంత్‌రెడ్డి, మసూద్‌, కొండల్‌, నాయకులు సంతుయాదవ్‌, దున్న నరేష్‌, దున్న భాస్కర్‌, మహిళా సంఘం సభ్యులు రెహానాబేగం, జ్యోతి, సుగుణ, సుమతి, మంజు భార్గవి, అన సూ య , ఎంపీడీవో వెంకట్రాములు, హౌసింగ్‌ డీఈ కేదార్‌, గ్రామ కార్యదర్శి స్వర్ణలత, ఎల్లికట్ల మాజీ సర్పంచ్‌ రాకేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 10:58 PM