Narrowly Escape Basement Collapse: కుంగిన డబుల్ ఇళ్ల బేస్‌మెంట్ ఫ్లోరింగ్
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:23 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్......
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్‌చార్జి కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం
వేములవాడ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డిపో సమీపంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. అయితే, ఇటీవల అర్థాంతరంగా నిర్మాణ పనులు నిల్చిపోయాయి. దీంతో పనులను తిరిగి చేపట్టేందుకు మంగళవారం గరిమా అగర్వాల్‌తో కలిసి ఆది శ్రీనివాస్ నిర్మాణాలను పరిశీలిస్తుండగా.. వారు నిల్చున్న బేస్‌మెంట్ ఫ్లోరింగ్ ఒక్కసారిగా కుంగిపోయింది. ప్రభుత్వ విప్, కలెక్టర్‌లు పట్టుతప్పి కింద పడబోగా అక్కడే ఉన్న నాయకులు వారిని పట్టుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టిన కారణంగానే ఫ్లోరింగ్ కుంగిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు.