Share News

Kavvampalli Satyanarayana: వైద్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:50 AM

రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు అండగా ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్‌లో ఆదివారం....

Kavvampalli Satyanarayana: వైద్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

  • మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

  • ఘనంగా ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గం ప్రమాణస్వీకారం

సుభా్‌షనగర్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు అండగా ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్‌లో ఆదివారం జరిగిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వైద్యుల సమస్యలు పరిష్కరించడంతోపాటు వారికి అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఐఎంఏ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్యశిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ పి. కిషన్‌, కార్యదర్శిగా వి. అశోక్‌, కోశాధికారిగా డాక్టర్‌ దయాల్‌ సింగ్‌, ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ విజయరావు, డాక్టర్‌ ఎంఎల్‌ ఎన్‌ రెడ్డి, డాక్టర్‌ బి. శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్‌ టీవీ శ్రీనివాస్‌, డాక్టర్‌ ఆర్‌. సునీత, డాక్టర్‌ పి. శరత్‌చంద్ర, డాక్టర్‌ యు. రామకృష్ణ, డాక్టర్‌ బి. రూప్‌లాల్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైద్య నిపుణులు సైంటఫిక్‌ సెషన్లు నిర్వహించారు. కరీంనగర్‌ ఐఎంఏ రాష్ట్రంలో అన్ని విభాగాల్లో ఉత్తమ బ్రాంచిగా ఎన్నికైంది. దీనికి సంబంధించి మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎనమల్ల నరేష్‌ అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బీఎన్‌ రావు, డాక్టర్‌ శ్యాంసుందర్‌, డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి, డాక్టర్‌ రామ్‌ కిరణ్‌ పొలాస పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 03:50 AM