Share News

క్షయ వ్యాధి నివారణ దిశగా ప్రభుత్వం చర్యలు

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:24 PM

క్షయ వ్యాధి నివార ణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలో బ్రౌస్‌ స్వచ్చంద సంస్థ సౌజన్యం తో టీబీ వ్యాధి గ్రస్తులకు పోషకాహార కిట్‌లను అందజేశారు.

క్షయ వ్యాధి నివారణ దిశగా ప్రభుత్వం చర్యలు

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : క్షయ వ్యాధి నివార ణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలో బ్రౌస్‌ స్వచ్చంద సంస్థ సౌజన్యం తో టీబీ వ్యాధి గ్రస్తులకు పోషకాహార కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లడుతూ ప్రధానమంత్రి టీబీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగం గా స్వచ్చంద సంస్థ సహకారంతో వ్యాధి గ్రస్తులకు పోషకాహార కిట్‌లను పం పిణీ చేస్తున్నామన్నారు. బ్రౌస్‌ స్వచ్చంద సంస్థ వారు 350 పోషకాహార కిట్‌ల ను అందించడం అభినందనీయమన్నారు. జిల్లాలో 797 పాజిటివ్‌ కేసులు ఉ న్నాయని, వ్యాధి గ్రస్తుల వివరాలను నిక్షయ మిత్ర పోర్టల్‌లో నమోదు చే యాలని తెలిపారు. అనంతర 10 మందికి పోషకాహార కిట్‌లను అందించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో అనిత, ప్రోగ్రాం అధికారి సుధాకర్‌ నాయక్‌, బ్రౌస్‌ సంస్థ వ్యవస్ధాపకులు శ్రీధర్‌, టీబీ సమన్వయకర్త సురేందర్‌, మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 11:24 PM