Share News

పేదలకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:02 AM

పేదలకు సీఎం రేవంత్‌రెడ్డి నాయక త్వంలోని ప్రజాప్రభుత్వం ఎ ల్లప్పుడూ అంగా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.

పేదలకు అండగా ప్రభుత్వం
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

- కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి

కల్వకుర్తి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : పేదలకు సీఎం రేవంత్‌రెడ్డి నాయక త్వంలోని ప్రజాప్రభుత్వం ఎ ల్లప్పుడూ అంగా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌ పార్టీ జెండా కల్వకుర్తి మునిసిపాలిటీలో ఎగురవేయాలని ఆ యన పిలుపునిచ్చారు. ఆదివారం కల్వకుర్తి ప ట్టణంలో రూ.6కోట్ల 32లక్షలతో చేపట్టే వివిధ అభివృద్ది పనులకు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి శంఖుస్థాపనలు చేశారు. అనంతరం ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్ర మంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కల్వకుర్తి పట్ట ణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నామ ని తెలిపారు.

కాంగ్రెస్‌లో పలువురి చేరిక

కల్వకుర్తి పట్టణంలోని పదవ వార్డుకు చెం దిన బీఆర్‌ఎస్‌ నాయకుడు అఖిల్‌తో పాటు 20 మంది యువకులు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి, మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌ల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానిం చారు. జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఠాకూర్‌ బాలా జీసింగ్‌, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌లు బృంగి ఆ నంద్‌కుమార్‌, పసుల సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాయితీ విజయ్‌కుమార్‌ రెడ్డి, వెల్దండ మాజీ సర్పంచ్‌ ఎన్నం భూపతి రెడ్డి, మార్కెట్‌ డైరెక్టర్లు పసుల రమాకాంత్‌రెడ్డి, మసూద్‌, నాయకులు షానవాజ్‌ఖాన్‌, సీహెచ్‌ సతీష్‌, ఏజాస్‌, గోరటి శ్రీనివాసులు, పుస్తకాల రాహుల్‌, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, శ్రీనివా సులు, నాని, సంతుయాదవ్‌, ఆరిఫ్‌, జీడిపల్లి సర్పంచ్‌ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 12:02 AM