kumaram bheem asifabad- ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Jun 24 , 2025 | 10:47 PM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును పడక్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. హైదరాబాద్‌లోని సచివాయలం నుంచి సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, గృహ నిర్మాణ శాఖ ఎండీ వీసీ గౌతం, అటవీ అధికారులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును పడక్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. హైదరాబాద్‌లోని సచివాయలం నుంచి సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, గృహ నిర్మాణ శాఖ ఎండీ వీసీ గౌతం, అటవీ అధికారులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం, ఉచిత ఇసుక సరఫరా, భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, వానాకాలం సీజన్ విత్తనాలు, ఎరువుల నిర్వహణ, వన మహోత్సవం లక్ష్యసాధన, అయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన, సీజనల్ వ్యాధుల నివారణ చర్యటు, టీబీముక్త్ భారత్ అంశాలపై సూచనులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందిస్తూ సీనరేజ్ చార్జీలను రద్దు చేసిందని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పెండింగ్ పనులు పూర్తి చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు రెండు పకడ గదుల ఇండ్ల పథకంలో నిర్మాణ పనుల ఎంబీ రికార్డులు నమోదు చేసి లబ్ధిదారులకు కేటాయించాలని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యజన అర్బన్ 2.0 కింద 1.13 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రతి పట్టణం నుంచి కనీసం 500 మంది నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేయాలని తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేస్తూ మొక్కలను పంపిణీ చేసి సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పంట సాగులో ఎరువుల లభ్యతపై సమీక్ష నిర్వహించుకోవాలని సూచించారు. జూలై వరకు అవసరమైన నిలువలు అందుబాటులో ఉందని అవసరమైన మేరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎరువుల నిలువలపై ప్రత్యేకాధికారులను నియమించి పర్యవేక్షించాలని తెలిపారు. ఈ ఏడాది 1.25 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు జరిగేలా లక్ష్యం నిర్ధేశించామన్నారు. పంట లాభంపై రైతులకు అవగాహన కల్పించి విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూ భారతి చట్టంలో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 8.27 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. సాదా బైనామా, ఆర్‌ఓఆర్ సమస్యలు, పట్టాల మార్పిడి వంటి వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులు ఆగస్టు 15వ తేదీనాటికి పరిష్కరించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యావంటి విష జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రభావిత ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రెండు నియోజక వర్గాల్లో మొదటి విడతగా 5,598 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 1,500 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. బేసిమెంట్ వరకు పూర్తి చేసిన లబ్ధిదారులకు నగదు జమ చేశామని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి ఉచిత ఇసుకను అందిస్తామన్నారు. భూ భారతి రెవెన్యూ సద్సులో 411 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి నోటీసులు జారీ చేసి విచారణ జరిపి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వన మహోత్సవంలో జిల్లాలో 41 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వానాకాలం విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ప్రతి రోజు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఆయిల్‌పామ్ సాగుకు చర్యలు చేపట్టామని అన్నారు. వానాకాలంలో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా రక్త పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జడ్పీ సీఈవో లక్ష్మినారాయణ, డీఎంహెచ్‌వో సీతారాం, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, గృహ నిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.