Minister Ponguleti Srinivas Reddy: జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:09 AM
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల జారీతో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన జర్నలిస్టులకు అందేలా....
త్వరలో అక్రిడిటేషన్ కార్డుల జారీకి విధివిధానాలు: పొంగులేటి
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల జారీతో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన జర్నలిస్టులకు అందేలా విధివిధానాలను రూపొందిస్తున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. సచివాలయంలో బుధవారం మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, సీఎంవోసీపీఆర్వో మల్సూర్‌తో సమావేశమైన మంత్రి అక్రిడిటేషన్ విధివిధానాలపై చర్చించారు. వీలైనంత త్వరగా అక్రిడిటేషన్ కార్డులను జారీ చేసేందుకు ఈనెల చివరినాటికి పాలసీ విధివిధానాలను రూపొందించాలన్నారు.