Share News

ఆలయాల పేరిట ప్రభుత్వ భూములు స్వాహా...!

ABN , Publish Date - Jul 28 , 2025 | 11:39 PM

మంచిర్యాల జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రభుత్వ భూములపై కన్నేస్తు న్న రియల్టర్లు వాటిని చేజి క్కించుకునేందుకు వినూ త్న పద్ధతులు అవలంభిస్తున్నారు. గుళ్లు, ఆశ్రమాల ని ర్మాణం పేరుతో సర్కారు భూముల్లో పాగా వేస్తూ, స మయం చూసుకొని వాటిలో అక్రమంగా ప్లాట్ల వెం చర్లు ఏర్పాటు చేస్తున్నా అడిగేవారు కరువయ్యారు.

ఆలయాల పేరిట ప్రభుత్వ భూములు స్వాహా...!

-కోట్ల విలువైన స్థలాల్లో అక్రమార్కుల పాగా

-మందమర్రి మండలం తిమ్మాపూర్‌లో ఘటన

-చేతులు మారిన సుమారు 40 ఎకరాలు

-అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేసిన రియల్టర్లు

మంచిర్యాల, జూలై 28 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రభుత్వ భూములపై కన్నేస్తు న్న రియల్టర్లు వాటిని చేజి క్కించుకునేందుకు వినూ త్న పద్ధతులు అవలంభిస్తున్నారు. గుళ్లు, ఆశ్రమాల ని ర్మాణం పేరుతో సర్కారు భూముల్లో పాగా వేస్తూ, స మయం చూసుకొని వాటిలో అక్రమంగా ప్లాట్ల వెం చర్లు ఏర్పాటు చేస్తున్నా అడిగేవారు కరువయ్యారు. మందమర్రి మండలం తిమ్మాపూర్‌ శివారులో గల ప్రభుత్వ భూమిలో గతంలో ఓ ఆశ్రమం పుట్టుకురాగా, తాజాగా మరో అతిపెద్ద గుడి నిర్మాణం జరుగుతోంది. వాటిని ఆనుకొని గోశాల ఏర్పాటు చకచకా జరి గిపోయాయి.

ఇరవై ఎకరాలు అన్యాక్రాంతం...

తిమ్మాపూర్‌ శివారులోని సర్వే నెంబర్‌ 438లో 75 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి లో కొం దరు భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం జీవనోపాధి కోసం గతంలో కొంత స్థలాన్ని అసైన్‌ చేసింది. మిగతా భూమిలో 20 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వె ళ్లగా, ఇద్దరి పేరిట రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి. ప్ర స్తుతం ఆ స్థలం విలువ ఎకరా రూ. కోటి పై చిలు కు ధర పలుకుతోంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన స్థలంలో గతంలో ఓ ఆశ్రమం నిర్మాణం జరుగగా, తా జాగా ఓ పెద్దగుడిని సైతం నిర్మాణంలో ఉంది. అదే స్థలంలో ఓ రెండంతస్థుల భవనం కూడా నిర్మితమైం ది. ట్రస్టు పేరిట గుళ్లు నిర్మిస్తుండగా, ప్రభుత్వపరంగా దానికి ఎలాంటి అనుమతులు లేవు. అలా గుడి, ఆశ్రమం పేరిట స్థలాన్ని ఆక్రమించి, వాటిని అక్రమం గా వెంచర్‌ ఏర్పాటు చేసి, యథేశ్చగా ప్లాట్లను విక్ర యిస్తున్నారు.

ఆదే శివారులో మరో 20 ఎకరాలు...

మందమర్రి మండలంలోని తిమ్మాపూర్‌ శివారులో నే మరో 20 ఎకరాల ప్రభుత్వ స్థలం కూడా అన్యా క్రాంతం అయింది. తిమ్మాపూర్‌ శివారులోని సర్వే నెం బర్‌ 325లో గాంధారి మైసమ్మ ఆలయం వద్ద జాతీ య రహదారిని ఆనుకొని 20 ఎకరాలు కొందరి పేరిట అక్రమ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. జాతీయ రహదారి ప క్కన ఉండటంతో వాటి విలువ ఎకరాకు రూ. 2 కోట్ల పై చిలుకు ధర పలుకుతోంది. ఆ భూముల్లోనూ ప ట్టాలు పుట్టుకురాగా, అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి, విక్రయిస్తున్నారు. రెండు సర్వే నంబర్లలోని 40 ఎకరా లు మాజీ సైనికుడు నాయిని చిన్న, అలియాస్‌ నాయి ని చిన్న సిపాయి పేరుతో పట్టా ఉంది. చాలా కాలం గా ఈ భూముల్లో పట్టాదారుకు సంబంధించిన వార సులు ఎవరూ లేరు. రికార్డుల్లో సైతం ఎలాంటి మా ర్పులు జరుగలేదు. సదరు భూమి తమదేనని సిఫా యి వారసులు ఎవరూ అధికారుల వద్దకు వచ్చిన సందర్భాలూ లేవు.

ఆధార్‌ మార్ఫింగ్‌తో స్కెచ్‌...

తిమ్మాపూర్‌ శివారులోని సర్వే నంబర్లు 325, 438 లో అసలు వారసులే లేని ఈ భూములకు కాల క్ర మంలో నకిలీ వారసులు పుట్టుకు వచ్చారు. స్థానికంగా పట్టున్న నాయకులు తమ పలుకుబడిని ఉపయో గించి, రెవెన్యూ అధికారుల సహకారంతో భూములు చేజిక్కించుకునేందుకు భారీ స్కెచ్‌ వేశారు. తెరపైకి ఓ వారసుడిని తీసుకొచ్చారు. స్థానికులైతే తమ బండా రం బయట పడుతుందని భావించి ఆంధ్రా ప్రాంతా నికి చెందిన ఓ వ్యక్తిని సిఫాయి వారసుడిని చేశారు. అందుకు తగినట్లు ఆధార్‌ కార్డును మార్ఫింగ్‌ చేశారు. ఆయనే వారసుడిగా నమ్మించారు. అతని పేరుతో అ వసరమైన చోట్టా దరఖాస్తులు పెట్టించి, సంతకాలు కూడా చేశారు. దీంతో ప్రొసీడింగులు పుట్టుకొచ్చాయి. అలా రెండు సర్వే నంబర్లలో 40 ఎకరాలను చేజిక్కించుకోగా, ఈ తతంగం నడిపించిన వారు తలా కొంత పంచుకున్నారు.

నకిలీ ఆధార్‌ భాగోతం బట్టబయలు...

సదరు భూములను సాగు చేసుకుంటున్న రైతులు అవి ఇతరుల పేరిట పట్టాలుగా మారడంతో ఆశ్చర్య పోయారు. నకిలీ ఆధార్‌తో భూముల్లో పేరు ఎక్కిన ఆంధ్రాలోని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, పె ద్దాపురానికి చెందిన దేవాడ రామిరెడ్డిని కలవడంతో అసలు విషయం వెలుగు చూసింది. వాస్తవానికి ఆయ నకు సిఫాయికి ఏ సంబంధం లేదని తెలుసుకున్న రైతులు తిరిగి వచ్చిన తరువాత ఆధారాలతో సహా త ప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారిపై మందమర్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా అక్రమంగా చేజిక్కించుకున్న భూముల్లో ప్రస్తుతం క్ర య విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

విద్యుత్‌ సౌకర్యం కోసం యత్నాలు...

ప్రభుత్వ భూముల్లో నిర్మించిన గుడికి విద్యుత్‌ సౌ కర్యం కోసం ముమ్మర యత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములు కావడంతో ఎన్‌వోసీ ఇచ్చేందుకు విద్యుత్‌శాఖ అధికారులు వెనుకంజ వేస్తున్నారు. దీం తో రాజకీయ పలుకుబడిని ఉపయోగించే ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆశ్రమం, గుడి లో జరిగే వివిధ కార్యక్రమాలకు చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి గడ్డం వివేకానందను పలుమార్లు ఆహ్వానించి, సన్మానాలు సైతం చేశారు. తద్వారా తమకు రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్పుకోవడం ద్వారా లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఇలాకాలో ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారు లు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఆ భూములను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు గుడిని ఎండోమెంట్‌శాఖ ఆధీనంలోకి తీసుకోవా లని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 28 , 2025 | 11:39 PM