Share News

సీఎంఆర్‌ బకాయిలపై సర్కారు సీరియస్‌...

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:31 PM

ప్రభుత్వం అందజేసిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో జిల్లాలోని కొందరు రైస్‌ మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారు. గడు వు ముగిసినా లక్ష్యం మేరకు సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లిం గ్‌ రైస్‌) ఇవ్వని మిల్లులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నా మొండి బకాయిదారుల్లో చలనం రావ డం లేదు.

సీఎంఆర్‌ బకాయిలపై సర్కారు సీరియస్‌...

-వానాకాలంలో 15, యాసంగిలో 55 శాతం పెండింగ్‌

-బకాయి మిల్లులపై ఆర్‌ఆర్‌ యాక్టు ప్రయోగం

-క్రిమినల్‌ కేసులూ నమోదు చేస్తున్న అధికారులు

-కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకూ సన్నాహాలు

-జిల్లాలో రూ. కోట్లలో పేరుకు పోయిన బకాయిలు

మంచిర్యాల, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందజేసిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో జిల్లాలోని కొందరు రైస్‌ మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారు. గడు వు ముగిసినా లక్ష్యం మేరకు సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లిం గ్‌ రైస్‌) ఇవ్వని మిల్లులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నా మొండి బకాయిదారుల్లో చలనం రావ డం లేదు. ఆయా సీజన్లలో పౌర సరఫరాల శాఖ అధ్వ ర్యంలో ధాన్యం స్వీకరించిన మిల్లులు సకాలంలో బి య్యం అందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నా పట్టిం చుకోకపోవడంతో రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) యాక్టు, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. గత సెప్టెం బరు 30 లోపు బియ్యం అప్పగించాలని ప్రభుత్వం హెచ్చరించినా మిల్లర్ల నుంచి స్పందన రాలేదు. కడపటి సంవత్సరం వానాకాలం సీజన్‌కు సంబంధించి ఖచ్చి తంగా మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు ఉన్నాయి. చాలా మంది మిల్లర్లు పలు కారణాలు చెబు తూ దాటవేసే ప్రయత్నం చేయడంతో అధికారులు ప్ర త్యక్ష చర్యలకు పూనుకుంటున్నారు. 2022-23 నుంచి 2023-24 సీజన్లకు సంబంధించి బకాయిలు దాదాపుగా రికవరీకాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చి మొద్దంలో సీఎంఆర్‌ పెండింగ్‌లో ఉంది. ఆ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 78875 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొను గోలు కేంద్రాల నుంచి సేకరించగా, సీఎంఆర్‌ కోసం 53079 మెట్రిక్‌ టన్నులను మిల్లులకు అప్పగించారు. వాటి నుంచి నేటి వరకు 44543 మెట్రిక్‌ టన్నుల బి య్యాన్ని తిరిగి అందజేయగా 85 శాతం రికవరీ అయిం ది. మిగిలిన 8535 మెట్రిక్‌ టన్నులు మిల్లర్ల వద్ద పెం డింగులో ఉన్నాయి. సీజన్‌ మారినా సంబంధిత మిల్లర్ల నుంచి స్పందన లేకపోవడం గమనార్హం. అలాగే ఆ సంవత్సరం రబీ సీజన్‌కు సంబంధించి 91028 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా, వాటి నుంచి 61899 మె ట్రిక్‌ టన్నులను సీఎంఆర్‌ కోసం అప్పగించారు. అందు లో ఇప్పటి వరకు కేవలం 27,824 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే తిరిగి అందజేయగా, మరో 34074 మెట్రిక్‌ టన్నులు పెండింగులో ఉంది. ఈ సీజన్‌లో సీ ఎంఆర్‌ పూర్తయింది కేవలం 45 శాతం కావడం కొసమెరుపు.

జిల్లాలో సీజన్ల వారీగా మిల్లర్లకు కేటాయించిన ధాన్యం, తిరిగి ఇవ్వాల్సిన బియ్యం వివరాలు మెట్రిక్‌ టన్నుల్లో....

సంవత్సరం సీజన్‌ ధాన్యం ఇవ్వాల్సిన బియ్యం పెండింగ్‌

2022-23 ఖరీఫ్‌ 40470.78 7308.583 2217.552

2022-23 రబీ 92169 26449 6716

2023-24 ఖరీఫ్‌ 139664 94057 39473

2023-24 రబీ 85266.520 57748 33600

2024-25 ఖరీఫ్‌ 53079 44543 8535

2024-25 రబీ 61899 27824 34074

ధాన్యం పక్కదారి...

జిల్లా వ్యాప్తంగా రైస్‌ మిల్లులకు అప్పగించిన ధా న్యం పక్కదారి పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ధా న్యాన్ని బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో విక్ర యిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీఎం ఆర్‌ ఇచ్చే సమయంలో రేషన్‌ బియ్యాన్నే కొనుగోలు చే సి, తిరిగి అప్పగిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నా యి. తనిఖీలో సమయంలో నిల్వలు చూపించాల్సి రావ డంతో రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ సీఎంఆర్‌గా చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌సీఐ అధికారులు పరిశీ లన సమయంలోనూ లెక్కలు చూపించకుండా తప్పిం చుకున్న మిల్లర్లు ఉన్నారు. గతంలో కొన్ని మిల్లుల్లో రేషన్‌ బియ్యం పట్టుబడటమే దీనికి నిదర్శనం. అలాగే ఒక్కొక్కరికి రెండేసి చొప్పున మిల్లులు ఉండగా, గత కొన్నేళ్లు ప్రభుత్వం ఇచ్చే ధాన్యంతో కోట్లకు పడగలెత్తు తున్నారు. వీటన్నింటి పైనా విచారణ జరిపేందుకు పౌరసరఫరాల శాఖ సిద్దపడుతోంది.

కేసులు నమోదవుతున్నా మారని తీరు...

సీఎంఆర్‌ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న మిల్లర్లపై జరిమానాలు, కేసులు విధిస్తున్నా వారి తీరు మారడం లేదు. ప్రతీ సీజన్‌లో ప్రభుత్వమే రైతుల నుంచి మద్ద తు ధరతో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుపుతోంది. ఈ ధాన్యాన్ని జిల్లాలో ఉన్న మిల్లులకు కేటాయిస్తే మిల్లర్లు సీఎంఆర్‌ చేసి తిరిగి అందించాలి. బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తే రేషన్‌ షాపుల్లో లబ్దిదారులకు పంపిణీ చే స్తారు. అయితే ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లు... బి య్యం మాత్రం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మిల్ల ర్లపై క్రిమినల్‌ కేసుల నమోదు, రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) చట్టం అమలు చేశారు. జిల్లాలో సీఎంఆర్‌ కోసం ఇచ్చిన ధాన్యం 56,000 మెట్రిక్‌ టన్నులు పక్క దారి పట్టగా, రూ. 218 కోట్ల పై చిలుకు విలువగల బియ్యం మాయమైనట్లు తెలుస్తోంది. ధాన్యం పక్కదారి పట్టించిన 23 మిల్లులపై ఇప్పటి వరకు ఆర్‌ఆర్‌ యాక్టు ప్రయోగించగా, మొండి బకాయిలున్న మరో 19 మి ల్లుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. తాజాగా దం డేపల్లి మండలం పెద్దపేట గ్రామంలోని వెంకటరమ ణ రైస్‌ మిల్లు యాజమాన్యంపై ఈ నెల 8న కేసులు నమోదు అయ్యాయి. వివిధ సీజన్లలో మిల్లు యా జమాన్యం బకాయిల విలువ రూ. 7 కోట్ల 60వేల పై చిలుకు ఉండగా, సివిల్‌ సప్లై అధికారుల ఫిర్యాదుతో పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. త్వరలో మరిన్ని మిల్లులపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. బియ్యం ఇవ్వని మి ల్లులకు జరిమానా, వడ్డీ కలిపి చెల్లించాలంటూ ప్రభు త్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో ధాన్యం విలువ కు వడ్డీతో సహా లెక్కలు గట్టి వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది మిల్లర్లు మొండి కేస్తుండ టంతో వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న స్థిరాస్థుల ను సైతం జప్తు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా 2023-24 రబీ సీజన్‌కు సంబంధించి 84 శాతం సీఎంఆర్‌ రికవరీ కాగా, 2024-25 ఖరీఫ్‌ సీజన్‌లో 61 శాతం, 2024-25 రబీ సీజన్‌లో 10 శాతం మేర సీఎంఆర్‌ రకవరీ జరిగింది.

కఠిన చర్యలకూ అవకాశం...!

సీఎంఆర్‌కు సంబంధించిన ధాన్యం బకాయిలు ఉన్న మిల్లర్లపై కఠిన చర్యలకూ ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. రూ. కోట్లలో బకాయిలు ఉన్న మిల్లులపై ఇప్పటికే పలు రకాల చర్యలు చేపట్టగా, అవసరమైన పక్షంలో ఈడీ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) విచా రణ కూడా జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొందరు మిల్లర్లు అప్రమత్తమై బకా యిలు చెల్లిస్తుండగా, మిగతా వారు కూడా దారిలోకి వస్తారనే భావనలో అధికారులు ఉన్నారు. రూ. కోట్లలో బకాయిలున్న మిల్లర్లు మాత్రం తమకున్న పలుకు బడిని ఉపయోగించి, కేసులు, ఆర్‌ఆర్‌ యాక్టు ముప్పు నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

చెన్నూరులో పుష్కరఘాట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

ప్రజల సౌకర్యార్థం పుష్కరఘాట్ల పరిశీలన

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : 2027 సంవత్సరంలో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ప్రజల సౌకర్యార్థం పుష్కర ఘాట్‌లను పరిశీలించామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నా రు. గురువారం చెన్నూరు మండల కేంద్రంలోని పుష్కరఘాట్‌ను పరి శీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి నది తీరంలో సౌకర్యాల కల్పన దిశగా పుష్కరఘాట్‌ల పరిస్థితులను పరిశీలి స్తున్నామన్నారు. స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పా ర్కింగ్‌, ఇతర ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నా రు. చెన్నూరు మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవం తం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ మురళీకృష్ణకు సూచించారు. అ నంతరం మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. వంట శాల, తరగతి గదు లు, మధ్యాహ్న భోజనం, నాణ్యత, రిజిష్టర్‌లు, పరిసరాలను పరిశీలిం చారు. విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, శుద్ధమైన నీటిని అందించాలన్నారు. తాజాకూరగాయలు, నాణ్యమైన స రుకులను వినియోగించాలన్నారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృ ష్టి సారించాలన్నారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఎంపీ డీవో మోహన్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 11:31 PM