మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:15 PM
మహిళ సాదికారత కు ప్రభు త్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్‌పీ గార్డెన్‌లో నియోజ కవర్గ మహిళ శక్తి సంబరాలకు ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎమ్మె ల్యే హాజరై మాట్లాడారు.
బెల్లంపల్లి, జూలై27 (ఆంధ్రజ్యోతి): మహిళ సాదికారత కు ప్రభు త్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్‌పీ గార్డెన్‌లో నియోజ కవర్గ మహిళ శక్తి సంబరాలకు ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎమ్మె ల్యే హాజరై మాట్లాడారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణా లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా మహిళా సంఘాలు లాభపడాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్ర భుత్వం ఇందిర మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నా రు. వడ్డీలేని రుణాలతో పాటు బ్యాంక్ లింకేజీ, ప్రమాద బీమా, రు ణ బీమా వంటి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రభుత్వం నుం చి మహిళలకు పెట్రోల్‌బంక్‌లు, ఎలక్ర్టిక్ బస్సులు అందిస్తూ ఆర్థిక బలోపేతానికి కృషి చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి మహిళా ఒక ఇందిరాగాంధీలా శక్తివంతమైన మహిళగా ఎదగ మని సూచిం చారు. అనంతరం మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు. ఈకార్యక్రమంలో డీఆర్‌డీఏ కిషన్, డీపీఎం స్వర్ణలతతో పాటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు
బెల్లంపల్లి: అర్హులైన ప్రతీ ఒక్కరు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందుతాయని కలెక్టర్ కుమార్‌దీపక్, ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ఆదివారం రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి హా జరై మాట్లాడారు. దేశంలో సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారు డికీ సంక్షేమ పథకాలను అందజేసేందుకు కృత నిశ్చయంతో ఉన్న ట్లు పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, నాయకులు నాతరి స్వామి, బండి ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.