ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:00 AM
పేదల ఆరోగ్య పరిరక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు.
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి
పార్వతీపురంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన జైవీర్
నిడమనూరు, మే 31(ఆంధ్రజ్యోతి): పేదల ఆరోగ్య పరిరక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. నిడమనూరు మండల కేం ద్రంలో రూ.1.56కోట్ల నిధుల వ్యయంతో నిర్మించిన నూత న పీహెచ్‌సీ భవనాన్ని శనివారం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరె డ్డి, డీఎంహెచ్‌వో పుట్ల శ్రీనివా్‌సతో కలిసి ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్య రం గానికి అధిక ప్రాధాన్యమిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అమలు చేస్తుందని, ఆరోగ్యశ్రీ పరిమితి కూడా రూ. 10లక్షల వరకు పెంచినట్లు తెలిపారు. ఆరోగ్య కేంద్రానికి అవసరమైన సామగ్రి అందించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. వైద్యులు ఎమ్మెల్యేకు బీపీ చూశారు. అనంతరం మండలంలోని పార్వతీపురంలో రూ.20 లక్షల ఈజీఎస్ నిధుల తో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్‌వో పుట్ల శ్రీనివాస్, పీఆర్ డీఈ రామాంజనేయులు, వైద్యాధికారు లు అరవింద్, బంగారు రమ్య, తహసీల్దార్ జంగాల కృష్ణ య్య, ఎంపీడీవో బోనగిరి రమేష్, ఏఈ సాయిప్రసాద్, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, మేరెడ్డి వెంకట్‌రాహుల్, అంకతి వెంకటరమణ, యడవెల్లి వల్లభ్‌రెడ్డి, వెంకట్‌బా బు, వంశీ, శ్రీనివా్‌సరెడ్డి, శివమారయ్య పాల్గొన్నారు.
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
త్రిపురారం: కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతోందని ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి అన్నారు. మండ ల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెంది న వారికి మంజూరైన పథకాలను మంజూరు చేశారు. కార్యక్రమంలో 87మందికి కల్యాణలక్ష్మి, షాదీముబార క్, 10మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి, ఐదు గురికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం ఇళ్లులే ని నిరుపేదల కోసం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకా న్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముడిమాళ్ల బుచ్చిరెడ్డి, నాయకులు అనుముల శ్రీనివా్‌సరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు బిట్టు రవికుమార్, నాయకులు భాస్కర్‌నాయక్, పద్మ, అనుముల వెంకట్‌రెడ్డి, చంద్రారెడ్డి, నరేష్, వేణు, భాస్కర్, వీరయ్య ఎంపీడీవో విజయకుమా రి, ఆర్‌ఐ సైదులు తదితరులు పాల్గొన్నారు.