Stalls Steal the Show at Global Summit: ఆకట్టుకున్న ప్రభుత్వ శాఖల స్టాళ్లు
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:11 AM
గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖల స్టాల్స్ ఆకట్టుకున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ స్టాల్‌లో ఎల్‌ఈడీ స్ర్కీన్‌లతో....
ప్రత్యేక ఆకర్షణగా మూసీ రివర్ స్టాల్
ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియోస్!
సమ్మిట్ ఖర్చు రూ 280 కోట్లు!
హైదరాబాద్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖల స్టాల్స్ ఆకట్టుకున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ స్టాల్‌లో ఎల్‌ఈడీ స్ర్కీన్‌లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంధన శాఖ నెట్ జీరో స్టాల్‌లో నిర్వహించిన క్విజ్ పోటీలో పలువురు ఐఏఎ్‌సలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్, ఏరో ేస్పస్ రంగంలో ఉన్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ స్టాల్ ఆకట్టుకున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ స్టాల్‌లో ఉంచిన కొన్ని ఫోటోలు చూపిస్తూ మూసీ గురించిన అంశాలను సీఎం రేవంత్ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు వివరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ రైజింగ్ తెలంగాణ విజన్-2047 డాక్యుమెంట్ బాగుందని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఫిలిం హబ్ ఏర్పాటు చేయాలని చర్చలు జరుగుతున్నాయన్నారు. అన్నపూర్ణ స్టూడియో్‌సను కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామని నాగార్జున ప్రకటించారు. ఈ సదస్సు కోసం ప్రభుత్వం దాదాపు రూ.280 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. సమ్మిట్ ఏర్పాట్ల విషయంలో సీఎస్ రామకృష్ణారావు ప్రత్యేక శ్రద్థ చూపారు. సమ్మిట్ కోసం ఆన్లైన్‌ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారికి పాసులు అందించడంలో విఫలమయ్యారనే విమర్శలొచ్చాయి. దీంతో వేదిక దగ్గరే దాదాపు 1,750 పాసులు అప్పటికప్పుడు జారీ చేశారు.