kumaram bheem asifabad- పల్లెల్లో పాలన అస్తవ్యస్తం
ABN , Publish Date - Aug 30 , 2025 | 10:48 PM
ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో అభివృద్ధి మాట అటుంచితే సమస్యలే పరిష్కారం కావడం లేదు. గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. సర్పంచుల పదవీ కాలం 2023 ఫిబ్రవరితో ముగిసింది. అప్పటి నుంచి పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై పడింది. ఏడాదిన్నర కాలంగా పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి పరిపాలన సాగిస్తున్నారు.
- అప్పులు తెచ్చి నెట్టుకొస్తున్న కార్యదర్శులు
- పాలకవర్గం లేకపోవడంతో నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు
- గ్రామాల్లో కుంటుపడుతున్న అభివృద్ధి
చింతలమానేపల్లి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో అభివృద్ధి మాట అటుంచితే సమస్యలే పరిష్కారం కావడం లేదు. గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. సర్పంచుల పదవీ కాలం 2023 ఫిబ్రవరితో ముగిసింది. అప్పటి నుంచి పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై పడింది. ఏడాదిన్నర కాలంగా పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి పరిపాలన సాగిస్తున్నారు. గ్రామాల్లో వసూలు చేసిన పన్నుల నుంచి కొంత డబ్బు ఖర్చు చేసినా గ్రామాల్లో కుంటుపడ్డ అభివృద్ధి పనులకు అవి ఏ మాత్రం చాలడం లేదు. దీంతో అభివృద్ధి కుంటుపడుతోంది. కానీ సెప్టెంబరు 30 లోపు ఎన్నికలు జరిగితేనే గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఉంటారు. దీని ద్వారానే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
- ఎస్‌ఎఫ్‌సీ నుంచి..
రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్‌ఎ ఫ్‌సీ) నుంచి మాత్రం పంచాయతీ కార్మి కుల వేత నాలు విడుదల చేస్తుంది. జిల్లాలో 335 గ్రామ పంచా యతీలు ఉన్నాయి. జిల్లాలోని గ్రామ పంచాయతీ వర్కర్ల వేతనాలను నెలనెలా ఇవ్వకున్నా కొంత మేర ప్రతీ రెండు, మూడు నెలలకో సారి విడుదల చేస్తోంది. అది కూడా పంచాయతీ కార్మికులు తమకు నెలనెలా వేతనాలు అందజేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాలు చేస్తే నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం విడుదల చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు పాలక వర్గం లేని కారణంగా విడుదల చేయడం లేదు. పాలక వర్గం బాధ్యతల చేపట్టితే తప్ప ఆ నిధులు వచ్చే పరిస్థితి లేదు. అటు కేంద్ర నిధులు రాక, ఇటు రాష్ట్రం నిధులు విడుదల చేయక గ్రామ పంచాయతీల నిర్వహణ ప్రత్యేకాధికారులకు తలకు మించిన భారం అవుతుంది.
- స్థానిక ఎన్నికలపై ముందుకు..
రాష్ట్ర ప్రభుత్వం నెలరోజుల్లోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తుందని పలువురు రాజకీయ విశ్లేష కులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీల ఓటర్ల జాబితాను ప్రచురించింది. సెప్టెంబరు 2న ఓటర్ల తుది జాబితా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించేందుకు ఎన్నికల కమిషన్ ఆదే శాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఎన్నికల నోటిపి కేషన్ జారీ అవుతుందని, సెప్టెంబరు నెలాఖరులోగా ఎన్నికల పూర్తవుతాయని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే సెప్టెంబరు 30 వరకు ఎన్నికలకు గడువు ఇవ్వగా ప్రభుత్వం అందుకు అనుగుణంగానే సన్నాహా లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా అనుకున్నట్లు సవ్యంగా ఎన్నికలు పూర్తై ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర నిధులతో గ్రామాలు అభివృద్ధి బాట పట్టనున్నాయి.