RTC Bus Info: గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ బస్సుల సమాచారం
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:56 AM
రాష్ట్ర ప్రజా రవాణా మరింత స్మార్ట్‌గా మారుతోంది. టీజీఎ్‌సఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్నప్పుడు గమ్యస్థానానికి ఎంత దూరంలో ఉన్నామన్న సమాచారం తెలుసుకోవడంతోపాటు...
త్వరలో మీ టికెట్ యాప్‌తో క్యూఆర్ కోడ్ టిక్కెట్లు.. డిజిటల్ పాస్‌లు
3 ఏళ్లలో హైదరాబాద్‌కు ఈ- బస్సులు
టీజీఎ్‌సఆర్టీసీ నిర్ణయం
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజా రవాణా మరింత స్మార్ట్‌గా మారుతోంది. టీజీఎ్‌సఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్నప్పుడు గమ్యస్థానానికి ఎంత దూరంలో ఉన్నామన్న సమాచారం తెలుసుకోవడంతోపాటు క్యూఆర్ ఆధారిత డిజిటల్ బస్సు పాస్, బస్సు టికెట్ల వివరాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వినియోగిస్తున్న ‘గమ్యం’ యాప్‌తో బస్సు బయలు దేరిన టైం, ఏ మార్గంలో ఎక్కడుంది, బస్టా్‌పకు ఎప్పుడు చేరుకుంటుంది వంటి పూర్తి సమాచారం ఇస్తున్నా అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. కనుక గూగుల్ మ్యాప్స్ సాయంతో మరింత కచ్చితత్వంతో బస్సుల రాకపోకల వివరాలను తెలుసుకోవచ్చు. ఇటీవల జరిగిన సమావేశ నిర్ణయం మేరకు టీజీఎ్‌సఆర్టీసీ అధికారులు.. బస్సుల సమస్త సమాచారాన్ని గూగుల్‌కు అందించనుండటంతో గూగుల్ మ్యాప్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వారం, పది రోజుల్లో గూగుల్‌కు ఆర్టీసీ బస్సుల డేటా అందించనున్న నేపథ్యంలో దీపావళికల్లా హైదరాబాద్ సిటీ బస్సుల సమాచారం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. దశల వారీగా రాష్ట్రంలోని మిగతా బస్సుల సమాచారం గూగుల్ మ్యాప్స్‌లో పొందుపరుస్తారు.
మీ టికెట్ ద్వారా డిజిటల్ టికెట్లు..
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ర్టానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎ్‌సడీ) విభాగం నిర్వహిస్తున్న ‘మీటికెట్’ యాప్ ద్వారా త్వరలో టీజీఎ్‌సఆర్‌టీసీ ఇంటర్‌సిటీ బస్సు సేవలు, క్యూఆర్ ఆధారిత డిజిటల్ బస్ పాస్‌లు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర స్మార్ట్ మొబిలిటీ ప్రణాళికలో భాగంగా చేపట్టిన సేవల విస్తరణతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతం కానుంది. ఇక బస్సు టికెట్లు, నెలవారీ పాస్‌లు ‘మీ టికెట్ యాప్’లోనే పొందొచ్చు. క్యూఆర్ కోడ్ బస్సు టికెట్లు, డిజిటల్ పాస్ సేవల ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఈఎ్‌సడీ తెలిపింది. దీంతో సాధారణ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఏసీ), పుష్పక్ ఎసీ బస్సుల డిజిటల్‌గా టికెట్లు, పాస్‌లు పొందవచ్చు. గత జనవరి 9న ప్రారంభమైన మీటికెట్ యాప్‌ను 1.35 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకోగా, 2.6 లక్షల టికెట్ బుకింగ్స్, రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. యాప్ రేటిం గ్ 3.5 పై చిలుకు నమోదైంది. ఇందులో 221 ప్రదేశాల్లోని పర్యాటక సేవలు అందుబాటులో ఉన్నాయి.
గ్రీన్ ఫీ నిధులతో ఈవీ డిపోలు
శబ్ద, వాయు కాలుష్యం తగ్గించడానికి టీజీఎ్‌సఆర్టీసీ.. హైదరాబాద్ నగర పరిధిలో తిరిగే డీజిల్ బస్సులను ఔటర్ రింగ్ రోడ్డు ఆవలకు పంపి.. వాటి స్థానే ఎలక్ట్రిక్ బస్సులను వినియోగంలోకి తేనున్నది. ఒక్కో డీజిల్ బస్సుతో రోజుకు 2.15 కిలోల చొప్పున 2,926 బస్సులతో నిత్యం సుమారు 600 టన్నుల కర్బ న ఉద్గారాలు వెలువడుతున్నాయి. పాత బస్సులు కావడంతో శబ్ద కాలుష్యం పెరగడంతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తిరుగుతున్న 265 ఎలక్ట్రిక్ బస్సులకు మరో 3 నెలల్లో 275 ఈవీ బస్సులు జత కలుస్తాయి. వచ్చే 3 ఏళ్లలో హైదరాబాద్‌లో 2,800 ఈవీ బస్సులను అందుబాటులోకి తేనున్నది. ఇందుకోసం నగరంలోని అన్ని డిపోలను ఈవీ చార్జింగ్ డిపోలుగా మార్చడంతోపాటు, వాటికి హైటెన్షన్ విద్యుత్ లైన్ల నిర్మాణం చేపట్టనున్నది. ఈవీ బస్సుల చార్జింగ్‌కు అవసరమైన విద్యుత్ సరఫరాకు హైటెన్షన్ విద్యుత్ లైన్ నిర్మాణానికి ఒక్కో డిపోకు 10 కోట్ల చొప్పున 392 కోట్ల భారం పడుతుందని భావిస్తున్నారు. దీన్ని రాబట్టుకునేందుకు గ్రీన్ ఫీ రూపంలో టికెట్లపై కనిష్టంగా రూ.5, గరిష్ఠంగా రూ.10 వసూలు చేయాలని నిర్ణయించింది. గ్రీన్ ఫీ రూపంలో ఒక ఏడాదిలో రూ.110 కోట్లు, రెండేళ్లకు 220 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా.