kumaram bheem asifabad- మద్యం దందాకు గుడ్‌విల్ టెండర్
ABN , Publish Date - Nov 11 , 2025 | 10:19 PM
మద్యం టెండర్లలో షాపులు దక్కిన వారికి వ్యాపా రం చేయకుండానే కాసుల వర్షం కురుస్తోంది. ఇటీవల ఎక్సైజ్ శాఖ నిర్వహించిన మద్యం టెండర్ల లక్కీ డ్రాలో వైన్స్‌లు దక్కని లిక్కర్ వ్యాపారులు లక్కీ డ్రాలో వచ్చిన వారితో బేరసారాలను మొదలు పెట్టారు. తమకు దుకాణం అప్పగిస్తే భారీగా నజరానా ఇస్తామంటూ గాలం వేస్తున్నారు. ఎలాంటి అనుభవం లేకున్నా లక్కీ డ్రాలో ఆదృష్టం వరించిన వారికి లక్ష్మి కటాక్షం లభిస్తోంది.
- జిల్లాలో రూ.1.14కోట్లు పలికిన ఓ మద్యం షాపు
- డిసెంబరు 1 నుంచి కొత్త దుకాణాల ఏర్పాటు
- డబ్బులు తీసుకోని వారిని భాగస్వామిగా చేర్చుకునే యోచన
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మద్యం టెండర్లలో షాపులు దక్కిన వారికి వ్యాపా రం చేయకుండానే కాసుల వర్షం కురుస్తోంది. ఇటీవల ఎక్సైజ్ శాఖ నిర్వహించిన మద్యం టెండర్ల లక్కీ డ్రాలో వైన్స్‌లు దక్కని లిక్కర్ వ్యాపారులు లక్కీ డ్రాలో వచ్చిన వారితో బేరసారాలను మొదలు పెట్టారు. తమకు దుకాణం అప్పగిస్తే భారీగా నజరానా ఇస్తామంటూ గాలం వేస్తున్నారు. ఎలాంటి అనుభవం లేకున్నా లక్కీ డ్రాలో ఆదృష్టం వరించిన వారికి లక్ష్మి కటాక్షం లభిస్తోంది. ఒక్కొ వైన్స్ ధర రూ. 85 లక్షల నుంచి 1.40 కోట్ల వరకు పలుకు తోంది. ఏరియాను బట్టి రేటు మారుతోంది. ఇప్పటికి చాలా దుకాణాలు చేతులు మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వైన్‌షాపుల గడువు ఈనెల 30వ తేదీతో ముగియనుంది.
- జిల్లాలో 680 దరఖాస్తులు..
జిల్లా వ్యాప్తంగా 680 మంది వైన్‌షాపుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఎక్సైజ్‌శాఖ 2025-2027కు సంవత్సరాలకు వైన్స్‌ల నిర్వహణకు టెండర్లు పిలి చింది. సెప్టెంబరు 26వ తేదిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అక్టోబరు 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. . అక్టోబరు 27వ తేదిన లక్కీ డ్రా పద్ధతిలో వైన్ షాపులను కేటాయించారు. కాగా ఆసిఫాబాద్ డివిజన్‌లోని కెరమెరి మండలం లోని గోయగాం వైన్‌షాపు దక్కిన వ్యక్తి దాన్ని అమ్మకానికి ఆసక్తి చూపడంతో రూ. 1.14 కోట్లకు విక్రయించారు. వాంకిడి మండల కేంద్రంలోని ఒక షాపు రూ. 1.20 కోట్లు, కాగజ్‌నగర్ మండలంలోని ఈస్‌గాం షాపు రూ. కోటి, బెజ్జూర్ మండల కేంద్రం లోని షాపు రూ. కోటికి విక్రయించనున్నట్లు సమా చారం. మిగతా మండలాల్లో సైతం పాత వ్యాపా రులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోం ది. లిక్కర్ ప్యాపారానికి అలవాటు పడి పెద్ద మొత్తంలో లబ్ధి పొందిన వ్యాపారులు లక్కీడ్రాలో దక్కని వారు గుడ్‌విల్ అకౌంటింగ్‌తో దక్కించుకునేందుకు తెరలే పారు. డబ్బులు తీసుకోని వారిని భాగస్వామిగా చేర్చుకునే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
- లెక్కల్లో వ్యాపారులు..
జిల్లాలోని ఏ మద్యం దుకాణం లెక్కలు చూసిన ఏడాదికి రూ. 2 కోట్లకు తక్కువగా లేదంటూ వ్యాపా రులు లెక్కల్లో తేలింది. దీంతో ప్రభుత్వానికి చెల్లించే రెంటల్‌కు పదింతలు అమ్మకాలకు మొదటగా 16 నుంచి 20 శాతం మార్జన్, ఆ తర్వాత విక్రయించే మద్యానికి 6 నుంచి 10 శాతం మార్జిన్ ఉండడంతో మద్యం దుకాణాలను ఎలగైనా దక్కించుకొవాలని సిండికేటు వ్యాపారులతో పాటు తమ దుకాణాలను తామే సొంతంగా నడుపుకుంటా మంటూ కొత్త వ్యా పారులు సిద్ధవుతున్నారు. మండలాల్లో గ్రామాల వారరీగా బెల్టుషాపు నిర్వహకులను కలిసి ఈసారి వైన్‌షాపులు తమకే వచ్చిందని ఇక్కడే మద్యం తీసు కోవాలని ముందుగానే చర్చలు మొదలు పెట్టారు.