Share News

అధిక సాంద్రత పత్తితో మంచి దిగుబడి

ABN , Publish Date - Nov 13 , 2025 | 10:57 PM

అధిక సాంద్రత విధానం తో పత్తి సాగు చేస్తే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సా ధించి లాభాలు గడించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ అన్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, ప్రొఫేసర్‌ జ యశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని బొప్పారంలో గురువారం అధిక సాంద్రత పత్తి సాగు క్షేత్ర పరిశీలన దినోత్సవాన్ని నిర్వహిం చారు.

అధిక సాంద్రత పత్తితో మంచి దిగుబడి

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ

నెన్నెల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : అధిక సాంద్రత విధానం తో పత్తి సాగు చేస్తే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సా ధించి లాభాలు గడించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ అన్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, ప్రొఫేసర్‌ జ యశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని బొప్పారంలో గురువారం అధిక సాంద్రత పత్తి సాగు క్షేత్ర పరిశీలన దినోత్సవాన్ని నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఏవో మాట్లాడుతూ తేలికపాటి నే లల్లో సైతం ఆధునిక పద్ధతిలో సాగు చేస్తే 30 శాతం దిగుబడి పె రుగుతుందన్నారు. పత్తిని రెండుమూడు సార్లు కాకుండా ఒకేసారి ఏ రుకోవచ్చన్నారు. పంట తొందరగా చేతికి వస్తుందని, ఆ తర్వాత ఇత ర పంటలు వేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చని చెప్పారు. సే ద్యశిభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ మహేష్‌ ఆధునిక పద్ధతిలో పత్తి సాగు విధానం, యాజమాన్య పద్ధతుల గూర్చి వివరించారు. అధిక మొక్క ల వల్ల ఆశించిన దిగుబడులు పొందంతో పాటు నేలసారాన్ని కాపా డుకోవచ్చన్నారు. ఖర్చులు సైతం చాలా వరకు తగ్గుతాయన్నారు. స స్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్‌ నాగరాజు మెడిక్యాటో పిచికారి గూర్చి వివరించారు. పోషక లోపాలు, కీటక, వ్యాధి లక్షణాల తేడాల గూర్చి చెప్పారు. సమగ్ర పోషక నిర్వహణ, యాంత్రిక పత్తి కోతలపై అవ గాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్‌ స్ర వంతి, సాద్వి, మండల వ్యవసాయ అధికారి పుప్పాల సృజన, ఏఈ వో రామ్‌చందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 10:57 PM