kumaram bheem asifabad- మహిళా సంఘాలకు తీపి కబురు
ABN , Publish Date - Jul 13 , 2025 | 10:42 PM
మహి ళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి సంస్థల అధికారులు, మున్సిపాలిటీల పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) డీఎంసీలు సర్కారుకు పూర్తిస్థాయి నివేదికలు అందజేస్తున్నారు.
- డీఆర్డీఏ, మెప్మా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు
- జిల్లాలో 1,02,161 మందికి ప్రయోజనం
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మహి ళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి సంస్థల అధికారులు, మున్సిపాలిటీల పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) డీఎంసీలు సర్కారుకు పూర్తిస్థాయి నివేదికలు అందజేస్తున్నారు. 2005 సంవత్సరం నుంచి మహిళా సంఘాలకు పావలా వడ్డీకి రుణ పథకం అమల్లోకి వచ్చింది. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ద్వారా రుణాలు తీసుకునే సభ్యులకు ఇది వర్తింపజేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2016 వరకు ఈ విధానం కొనసాగింది. 2017 తర్వాత పావలా వడ్డీ డబ్బులు వారి ఖాతాల్లో వేయడం నిలిచిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించేందుకు కసరత్తు చేస్తుండడంతో మహిళా సంఘాలకు లబ్ధి చేకూరనుంది.
- జిల్లా వ్యాప్తంగా..
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామపం చాయతీలు, రెండు మున్సిపాలిటీలలో 9,047 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 1,02,161 మంది సభ్యులున్నారు. ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో మహిళలు ఆశించిన స్థాయిలో లబ్ధి పొందే వీలుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తింప జేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందిరి మహిళా శక్తి పథకం ద్వారా ఇప్పటికే సౌర విద్యుత్ యూనిట్లు, ఆర్టీసీ బస్సులు, ఇటుకల తయారీ తదితర పథకా లను వర్తింపజేశారు. రానున్న రోజుల్లో వడ్డీ లేని రుణాలు రూ. 50 వేల నుంచి రూ. కోటి వరకు ఇచ్చి స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పేలా ప్రొత్సహిం చేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
- మహిళలు ఆర్థికంగా బలపడేలా..
మహిళలు ఆర్థికంగా బలపేడేలా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అర్హులైన సంఘాలకు బ్యాంకు రుణాలు, కొత్త వ్యాపారాల ఏర్పాటుకు ఆర్థిక సాయం, క్యాంటీన్ల ఏర్పాటు వంటివి చేస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతోంది. ప్రభుత్వపరంగా అతి వలకు చేస్తున్న కార్యక్రమాలపై ప్రచారం కల్పించేం దుకు ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహిస్తోం ది. ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు గ్రామ, మండల, పట్టణ సమాఖ్య సమావేశాలను ఏర్పాటు చేసి సంబరాలు నిర్వహించారు. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు సంఘాల సభ్యుల వివరాలు సేక రించడంతో పాటు అర్హులైన వారికి వడ్డీలేని రుణాలు ఇవ్వడానికి ప్రణాళికతో సాగుతున్నారు.
5,037 గ్రూపులకు రుణాలు మంజూరు..
- దత్తారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
జిల్లాలో 9,047 గ్రూపులకు గాను 5,037 గ్రూపుల కు వడ్డీలేని రుణాలు మంజూరయ్యాయి. డీఆర్డీఏ పరి ధిలో 7,947, మెప్మా పరిధిలో 1,100 గ్రూపులు న్నా యి. ప్రస్తుతం 5,037 మందికి రూ. 5.65 కోట్టు మం జూరయ్యాయి. మిగిలిన వారికి విడతల వారీగా మం జూరు లభించనుంది. గ్రామీణ ప్రాంత మహి ళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి ద్వారా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.