Share News

kumaram bheem asifabad- సుజలాం..సుఫలాం..

ABN , Publish Date - Nov 07 , 2025 | 10:26 PM

స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీ యుల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గీతానికి శుక్రవారంతో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవున కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

kumaram bheem asifabad- సుజలాం..సుఫలాం..
ఆసిఫాబాద్‌లో వందేమాతర గీతాన్ని ఆలపిస్తున్న కలెక్టర్‌, ఇతర అధికారులు

- పాల్గొన్న అధికారులు, యువజన సంఘాల నాయకులు

ఆసిఫాబాద్‌రూరల్‌/బెజ్జూరు/పెంచికలపేట/దహెగాం/సిర్పూర్‌(టి)/వాంకిడి/జైనూర్‌/కెరమెరి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీ యుల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గీతానికి శుక్రవారంతో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవున కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కుమరం భీం జిల్లాలో ఈ కార్యక్ర మాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమానికి ఆసిఫా బాద్‌ ఆర్డీవో లోకేశ్వర్‌రావు, అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతనిధులతో కలిసి హాజరై గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి కావడంతో సంతోషంగా ఉందని, స్వాతంత్ర ఉద్యమకాలంలో పోరాటానికి స్పూర్తినిచ్చిందని తెలిపారు. భారతీయులందరిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిందని, దేశ ఐక్యతకు ఈ గీతం నిదర్శనమని అన్నారు. వందేమాతరం గీతాన్ని ఆలపించడం ద్వారా దేశభక్తిని చాటుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, యువజన సంఘాల ప్రతినిధులు తదితరలు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ఆరై పెద్దన్న, అంజన్న, డీసీఆర్బీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీధర్‌, రవీందర్‌, సిబ్బంది పాల్గొన్నారు. బెజ్జూరు మండల కేంద్రంలోని మహత్మ జ్యోతిబాఫూలే విద్యాలయంతో పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వందేమాతరం గీతంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పెంచికలపేట ఎంపీడీవో కార్యాలయం, పోలీసు స్టేషన్‌తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. దహెగాం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గ్రామ పంచాయతీల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. సిర్పూర్‌(టి) మండ లంలో ఎంపీడీవో, తహసీల్దార్‌, పోలీసు స్టేషన్‌తో పాటు అన్ని గ్రామ పంచాయతీల్లో వందేమాతర గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్‌ రహీముద్దీన్‌, ఎస్సై సురేష్‌తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం వందేమాతర గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జైనూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు వివిధ కార్యాలయాల్లో ఉద్యోగులు వందేమాతరం గేయాలపన ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్ర మాల్లో తహసీల్దార్‌ ఆడ బీర్షావ్‌, ఎంపీడీవో సుధాకర్‌ రెడ్డి, ఆర్‌ఐ మోహన్‌, సూపరిం టెండెంట్‌ శ్రీనివాస్‌, ఎంపీవో మోహన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కెరమెరి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాల యాల్లో శుక్రవారం వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 10:26 PM