Share News

మాస్టర్‌ ప్లాన్‌కు మంగళం...

ABN , Publish Date - Dec 26 , 2025 | 10:03 PM

మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలో మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు అ నేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు రెం డు పర్యాయాలు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ మరు గున పడగా రహదారుల సౌకర్యం లేక ప్రజలు, వాహ న చోధకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధులు ప్రేక్షక పాత్ర ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు దాపురించాయి.

మాస్టర్‌ ప్లాన్‌కు మంగళం...
శ్రీశ్రీ నగర్‌లో అర్థాంతరంగా నిలిచిపోయిన బైపాస్‌ రోడ్డు నిర్మాణం

-బైపాస్‌ రోడ్ల నిర్మాణానికి తీవ్ర అడ్డంకులు

-అర్థాంతరంగా నిలిచిపోయిన శ్రీశ్రీ నగర్‌ రోడ్డు

-మాస్టర్‌ ప్లాన్‌ అమలులో మున్సిపాలిటీ విఫలం

-ఇబ్బందులు పడుతున్న వాహన చోధకులు, ప్రజలు

మంచిర్యాల, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలో మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు అ నేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు రెం డు పర్యాయాలు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ మరు గున పడగా రహదారుల సౌకర్యం లేక ప్రజలు, వాహ న చోధకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధులు ప్రేక్షక పాత్ర ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు దాపురించాయి. జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ నాటి నుంచి మంచిర్యాల నగరం దినదినాభివృద్ధి చెందుతోం ది. విద్య, వైద్యంతోపాటు ఉపాధి కోసం గ్రామీణ ప్రాం తాల నుంచి ప్రజల వలసల కారణంగా జనసంచారం అధికమవడంతో నగరం శరవేగంగా విస్తరిస్తోంది. మ రోవైపు వ్యాపార కేంద్రంగానూ విరాజిల్లుతున్న మంచి ర్యాల నగరంలో రోడ్ల పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది.

మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు అడ్డంకులు...

నగరం శరవేగంగా విస్తరిస్తుండటంతో భవిష్యత్‌ అ వసరాల దృష్ట్యా మున్సిపాలిటీ మాస్టర్‌ ప్లాన్‌ రూపొం దించింది. 1972లో ఓసారి, 2012లో మరోసారి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించినప్పటికీ దాన్ని అమలు చేయకపో వడం ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది. మాస్టర్‌ ప్లా న్‌ అమలులో తీవ్ర జాప్యం కారణంగా ఇదే అదునుగా రోడ్ల కేటాయించిన స్థలాల్లో కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఎక్కడికక్కడే ప్లాట్ల వెంచర్లు ఏర్పాటు చేసి అమ్ముకున్నారు. మొదటిసారి రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో రెండోసారి మార్పులు జరిగినప్పటికీ వాటిని పట్టించుకోకుండా వెంచర్లు ఏర్పాటు చేసి విక్రయాలు సాగించడంతో రోడ్ల నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. వెం చర్లు ఏర్పాటు చేసిన వారే తమ భూములు రోడ్ల కింద పోతున్నాయంటూ పరిహారం కోరడంతో మున్సిపల్‌ అ ధికారులు చేతులెత్తేశారు. మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి న వెంటనే రోడ్లను గుర్తిస్తూ మున్సిపాలిటీ మార్కింగు లు చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. అలాగే బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఇస్లాంపుర మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు శాశ్వత రోడ్డు నిర్మాణం చేపట్టవలసి ఉంది.

అర్థాంతరంగా నిలిచిన 100 ఫీట్ల రోడ్డు....

మంచిర్యాల నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతు న్న దశలో భవిష్యత్తులో పెరిగే జనాభాను దృష్టిలో పె ట్టుకొని 1972 మాస్టర్‌ ప్లాన్‌ ఆధారంగా ప్రధాన రహదారులకు కలిసేలా బైపాస్‌ రోడ్లను నిర్మించేందుకు ప్ర ణాళిక తయారు చేశారు. అనంతరం కొన్ని కారణాల వల్ల 2012లో తిరిగి నూతన మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి, రోడ్ల నిర్మాణ నమూనాను ఏర్పాటు చేశారు. కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం...మంచిర్యాల-గోదావరిఖని జాతీ య రహదారిని ఆనుకొని శ్రీశ్రీ నగర్‌ మొదలుకొని తిలక్‌నగర్‌, రాముని చెరువు మీదుగా మంచిర్యాల-బెల్లంప ల్లి ప్రధాన రహదారితో కలిసేలా లక్ష్మీ టాకీస్‌ చౌరస్తా వరకు 100 ఫీట్ల వెడల్పయిన బైపాస్‌ రోడ్డు నిర్మించేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. అప్పట్లో శ్రీశ్రీ నగర్‌ వద్ద కొద్దిమేర రోడ్డు నిర్మాణం చేపట్టగా, స్థానిక లయన్స్‌ భవన్‌ వరకు బీటీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. సుదీర్ఘ కాలం తరువాత తిరిగి రోడ్డును కొనసాగించే క్రమంలో నాలుగేళ్ల క్రితం టీయూఎఫ్‌ఐడీసీ (తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) నిధులు దాదాపు రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 1300 మీటర్ల మేర నిర్మాణాన్ని చేపట్టారు. మొదట మట్టితో రోడ్డు నిర్మాణం చేపట్టి, అ నంతరం బీటీ వేయాల్సి ఉండగా ప్రజల నుంచి అభ్యం తరాలు వెలువడటంతో రెండు చోట్ల రహదారి నిర్మా ణం నిలిచిపోయింది. బైపాస్‌ పట్టా భూముల గుండా వెళ్తుండటంతో కొందరు రోడ్డు నిర్మించకుండా అడ్డుగా ట్రెంచ్‌ తవ్వడంతో నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో బైపాస్‌ను పక్కనే ఉన్న మరో 100 ఫీట్ల బైపాస్‌కు లింకు చేస్తూ మున్సిపల్‌ అధికారులు 30 ఫీట్ల వెడల్పుతో సుమారు 75 మీటర్ల పొడవుతో స ర్వీస్‌ రోడ్డును ఏర్పాటు చేశారు. దీనిని సైతం ప్రజలు అడ్డుకోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అలాగే స్థానిక పోచమ్మ గుడి వద్ద కూడా కొందరి అభ్యంతరాల వల్ల రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది.

మరో బైపాస్‌ రోడ్డుదీ అదే పరిస్థితి...

నగరంలోని వైశ్యాభవన్‌ సమీపంలో నిర్మించతల పె ట్టిన 80 ఫీట్ల బైపాస్‌ రోడ్డుదీ అదే పరిస్థితి ఉంది. వైశ్యాభవన్‌ దగ్గర జాతీయ రహదారి మొదలుకొని ఎన్టీఆర్‌ నగర్‌ మీదుగా మాతా శిశు ఆరోగ్య కేంద్రం నుంచి సున్నంబట్టి వాడ వద్ద తిరిగి జాతీయ రహదా రికి అనుసంధానం చేసేలా రెండు మాస్టర్‌ ప్లాన్లలో ప్ర తిపాధించిన 80 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి దశాబ్దాలుగా మోక్షం కలగడం లేదు. గతంలో ఒకసారి బైపాస్‌ నిర్మా ణం తెరపైకి రావడంతో తాము భూములు కోల్పోతు న్నామంటూ కొందరు రోడ్డుకు అడ్డంగా లోతైన కందకా లు తవ్వి నిర్మాణాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. స మాచారం అందుకున్న మున్సిపల్‌ అధికారులు కందకా లను పూడ్చివేశారు. బైపాస్‌ రోడ్డు కోసం కేటాయించిన స్థలంలో కాల క్రమంలో వైశ్యాభవన్‌ నుంచి సున్నంబట్టి వాడ వరకు అనేక నివాస గృహాలు వెలిశాయి. అక్రమ నిర్మాణాలను తొలగిస్తేనే రోడ్డు నిర్మాణం జరిగే అవకా శాలు ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే వైశ్యా భవన్‌ నుంచి గోదావరిఖని, చెన్నూరు వైపు వెళ్లే వాహ న చోధకులకు ట్రాఫిక్‌లో ఇరుక్కోవలసిన అవసరం లేకుండానే నేరుగా ప్రయాణించే వీలు ఏర్పడుతుంది.

మూలన పడ్డ ఆర్వోబీ...

లక్ష్మీ టాకీస్‌ చౌరస్తా నుంచి గోపాల్‌వాడ మధ్య రైల్వే ట్రాక్‌పై రూ. 77 కోట్లతో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) ని ర్మిస్తామని 2018 ఎన్నికల సమయంలో శ్రీరాంపూర్‌కు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆర్వోబీ నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్న అప్ప టి ఎమ్మెల్యే దివాకర్‌రావు కోరిక మేరకు కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా అడుగు ముం దుకు పడలేదు. మరోవైపు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఆర్వో బీ అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి కేటాయించిన స్థలం తమ దంటూ మంచిర్యాల సిమెంట్‌ కంపెనీ యాజమాన్యం అప్పట్లోనే బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు కోర్టు ను ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ అర్థాంతరంగా నిలిచి పోయింది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్న తాధికారులు పెండింగ్‌లో ఉన్న బైపాస్‌ రోడ్లపై దృష్టి సారించడం ద్వారా త్వరితగతిన వాటి నిర్మాణం చేపట్టి ప్రజల ట్రాఫిక్‌ అవస్థలు తొలగించాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.

Updated Date - Dec 26 , 2025 | 10:04 PM