Share News

పోష్టికాహారంతోనే చక్కటి ఆరోగ్యం

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:04 PM

పోష్టికాహారంతోనే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఆ లోపాలను అరికట్టాలని జిల్లా ఇన్‌చార్జి సంక్షేమ అధికారిణి రాజేశ్వరీ, లక్షెట్టిపేట ఐసీడీఎస్‌ సీడిపీవో రేష్మలు సూచిం చారు.

   పోష్టికాహారంతోనే చక్కటి ఆరోగ్యం
సూరారంలో రైతు వేదికలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న అధికారులు.

జిల్లా ఇన్‌చర్జి సంక్షేమ అధికారిణి రాజేశ్వరీ

దండేపల్లి (లక్షెట్టిపేట) ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): పోష్టికాహారంతోనే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఆ లోపాలను అరికట్టాలని జిల్లా ఇన్‌చార్జి సంక్షేమ అధికారిణి రాజేశ్వరీ, లక్షెట్టిపేట ఐసీడీఎస్‌ సీడిపీవో రేష్మలు సూచిం చారు. పోషణ పక్వాడ్‌ పక్షోత్సవాల సందర్భంగా పోషక అభియాన్‌ను లక్షెట్టిపేట మండలం సూరారం రైతు వేదికలో గురువారం లక్షెట్టిపేట ఐసీడీఎస్‌ పరిధిలోని అంగన్‌వాడీ టిచర్లకు, గర్భిణులకు పోషకాహారం, సామూహిక సీమంతాలు, చిన్నారులకు అక్షరభ్యాసం చేయించారు. వా రు మాట్లాడుతూ మహిళలు, గర్బిణులు పోషక విలువతో కూడిన ఆకు కూరలు, చిరుధాన్యాలు, పండ్లు తీసుకోవాలన్నారు. గర్బిణులు పౌష్టికా హారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చునన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్ల వనితా వాక్కు ఫాండేషన్‌ కో ఫాండర్‌ కవిత, జిల్లా సమన్వయ అధికారిణి రజిత, సమన్వయ సహా యక అధికారిణి శ్యామల, జిల్లా మహిళ సాధికారిత అధికారిణి సౌజన్య పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:04 PM