క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:12 PM
విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
చ్చంపేటటౌన్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. పట్టణంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో సోమవా రం అండర్-14 బాల బాలికల స్కూల్ ఫెడరేష న్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్న మెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడ లను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ చైర్మన్ రాజేందర్, మునిసిపిల్ చైర్మన్ శ్రీ నివాసులు, ఎంఈవో జీవన్‌కుమార్, పీటీలు క్రీడాకారులు, విద్యార్థులు ఉన్నారు.
గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ
బల్మూరు (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బే రరామాజీపల్లి గ్రామంలో నూతన గ్రామపంచా యతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ సోమవారం భూమి పూజ చేశారు. ఉపాధి హామీ పథకం నుంచి రూ.20లక్షలతో నిర్మించ నున్నారు. అనంతరం మండల కేంద్రంలో రైతు వేదికలో సహ కార సంఘం, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేం ద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్య క్షుడు వెంకటరెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షుడు గిరివర్ధన్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి కాశన్నయాదవ్, ఖదీర్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అమ్రాబాద్ (ఆంధ్రజ్యోతి) : మండల కేం ద్రంలోని అమరేశ్వర ఆలయం చుట్టూ రూ.10 లక్షలతో నిర్మించనున్న ప్రహరీ ఏర్పాటు, కోనేరు పునర్నిర్మాణ పనులకు సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ భూమి పూజ చేసి ప్రారంభించారు. అమరేశ్వరాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ తిప్పర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. అక్కడ కోటి దీపోత్స వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ దంప తులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల కేం ద్రంలోని జామే మసీద్ లోపల రూ.10లక్షలతో పూర్తి చేసిన సీసీనిర్మాణ పనులతో పాటు అక్కడే రెండు లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్టు లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ డాక్టర్ అనురాధ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.