Gold Seizure: ఎయిర్‌పోర్ట్‌లో రూ.2.37 కోట్ల విలువైన బంగారం పట్టివేత
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:59 AM
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.2.37 కోట్ల విలువ గల 1,798 గ్రాముల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు...
శంషాబాద్ రూరల్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.2.37 కోట్ల విలువ గల 1,798 గ్రాముల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్ అరేబియా విమానం జీ9 467 ద్వారా కువైట్ నుంచి షార్జా మీదుగా వచ్చిన ప్రయాణికుడిని డీఆర్‌ఐ, హెచ్‌జడ్‌యూ అధికారులు సోదా చేశారు. ప్రయాణికుడి బ్యాగును క్షుణ్ణంగా పరిశీలించగా ఐదు 24 క్యారెట్ల బంగారు కడ్డీలు, రెండు 24 క్యారెట్ల బంగారు కడ్డీల ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.37 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో డోర్ మెటాలిక్ లాక్‌లో, రెండు బంగారు కడ్డీ ముక్కలను, పొద్దు తిరుగుడు విత్తనాలు గల ప్లాస్టిక్ సంచిలో దాచి పెట్టినట్లు గుర్తించారు. ప్రయాణికుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.