Share News

గోదావరి స్నానాలు..కార్తీక దీపాలు

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:03 PM

కార్తీక బహుళ పంచమి పురస్కరించుకుని దండేపల్లి మండలం సత్యనారాయణ స్వామి దే వాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినంకావ డంతో భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చిస్వామిని దర్శించుకున్నారు.

 గోదావరి స్నానాలు..కార్తీక దీపాలు

గూడెం ఆలయంలో భక్తుల సందడి

దండేపల్లి నవంబరు 9(ఆంధ్రజ్యోతి): కార్తీక బహుళ పంచమి పురస్కరించుకుని దండేపల్లి మండలం సత్యనారాయణ స్వామి దే వాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినంకావ డంతో భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చిస్వామిని దర్శించుకున్నారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజల నడుమ గోదావరి నదిలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం గూడెం ఆలయానికి చేరుకొని స త్యదేవుడిని దర్శించుకున్నారు. 500పైగా మంది భక్తులు కుటుంబ సమేతంగా శ్రీసత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలను ఆచ రించారు. ఆలయంలోని రావిచెట్టు, ప్రధానాలయం ఎదుట గల ధ్వ జస్తంభం వద్ద ఉసిరికాయలతో కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక శోభతో ఆలయ పరిసర ప్రాంతమంత భక్తులతో సందడి నెలకొంది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు క ల్పించినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్‌, సూపరిండెంట్‌ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

Updated Date - Nov 09 , 2025 | 11:04 PM