Share News

GHMC: ప్రైవేట్‌ హాస్టళ్లపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా

ABN , Publish Date - May 25 , 2025 | 05:16 AM

జీహెచ్‌ఎంసీ టాస్క్‌ఫోర్స్‌ గ్రేటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు జరిపింది. 60 హాస్టళ్లను పరిశీలించి, 38 హాస్టళ్లకు నోటీసులు జారీ చేసి, రూ.2.46 లక్షల జరిమానా విధించారు.

GHMC: ప్రైవేట్‌ హాస్టళ్లపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా

స్పెషల్‌ డ్రైవ్‌లో తనిఖీలు.. 38 హాస్టళ్లకు నోటీసులు

నిబంధనలు పాటించని వారికి 2,46,000 జరిమానా

హైదరాబాద్‌ సిటీ, మే 24 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్‌ హాస్టళ్లపై జీహెచ్‌ఎంసీ టాస్క్‌ఫోర్స్‌ కొరడా ఝళిపిస్తోంది. గ్రేటర్‌లో రెండు రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు హాస్టళ్లలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు విస్తృతంగా త నిఖీలు నిర్వహిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలతో వివిధ విభాగాల అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందం పలు ప్రాంతాల్లో హాస్టళ్లను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఎల్‌బీనగర్‌లోని శ్రీనగర్‌కాలనీ, లలితనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి జోన్‌లోని కేపీహెచ్‌బీ, మూసాపేట ప్రాంతాలు, శేరిలింగంపల్లి జోన్‌లోని వినాయకనగర్‌, పత్రికా నగర్‌లలో శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. 60 హాస్టళ్లను తనిఖీ చేసి 38 హాస్టళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. 7 హాస్టళ్లలో కిచెన్లు మూసివేశారు. నిబంధనలు ఉల్లంఘించిన హాస్టళ్ల నిర్వాహకులకు రూ. 2.46 లక్షల జరిమానా విధించారు. పలు ప్రాంతాల్లో కొంతమంది హాస్టళ్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిర్వహిస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా తనిఖీలు చేయిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..


Updated Date - May 25 , 2025 | 05:16 AM