kumaram bheem asifabad- కూరుకుపోతున్నాయ్..
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:23 PM
జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో రోడ్లు వర్షాలకు నీరు నిలిచి బరదగా మారడంతో వాహనాలు కూరు కుపోతున్నాయి. బెజ్జూరు మండల కేంద్రంలోని పలు గిరిజన గ్రామాల ప్రజలు వెళ్లే రోడ్డు...ఆయా గ్రామాల ప్రజలు నిత్యం వివిద అవసరాల నిమిత్తం మండల కేంద్రమైన బెజ్జూరుకు వస్తుంటారు. ఉన్నత చదువుల కోసం పాఠశాల విద్యార్థులు కూడా బెజ్జూరుకు వస్తుంటారు.
- రాకపోకలకు గ్రామస్థులకు తప్పని ఇక్కట్లు
- ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం
బెజ్జూరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో రోడ్లు వర్షాలకు నీరు నిలిచి బరదగా మారడంతో వాహనాలు కూరు కుపోతున్నాయి. బెజ్జూరు మండల కేంద్రంలోని పలు గిరిజన గ్రామాల ప్రజలు వెళ్లే రోడ్డు...ఆయా గ్రామాల ప్రజలు నిత్యం వివిద అవసరాల నిమిత్తం మండల కేంద్రమైన బెజ్జూరుకు వస్తుంటారు. ఉన్నత చదువుల కోసం పాఠశాల విద్యార్థులు కూడా బెజ్జూరుకు వస్తుంటారు. కానీ ఆ రోడ్డు మా త్రం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బురదమ యంగా మారి నడవడానికి కూడా లేని పరిస్థితి ఉంది. ఈ రోడ్డు మీదుగా దాదాపు 10గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా ఇవే తిప్పలు పడుతున్నా ఏ ఒక్కరూ స్పందించడం లేదని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన చెందు తున్నారు. రెండు రోజుల క్రితం సోమిని గ్రామం నుంచి పాఠశాల విద్యార్థులను బెజ్జూరుకు తీసుకు వస్తుండగా టాటాఏసీ వాహనం బురదలో కూరుకు పోయింది. దీంతో గ్రామస్థులు అతికష్టం మీద వాహనాన్ని ట్రాక్టర్‌కు కట్టి వెనుకనుంచి తోలి బయటకు తీశారు.
- గతంలో నిధులు మంజూరైనా..
గతంలో కుశ్నపల్లి నుంచి సోమిని వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు కూడా చేసింది. అయితే అటవీ అనుమతులు లేవన్న కారణంతో రోడ్డు పనులు ఆగిపోయాయి. తాము అటవీ గ్రామాల్లో పుట్టడమే శాపమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కుశ్నపల్లి అవుతల ఉన్న సుశ్మీర్, సోమిని, మొగవెల్లి, ఇప్పలగూడ, నాగేపల్లి, పాతసోమిని, గెర్రెగూడ, బండలగూడ, చింతలపల్లి తదితర గ్రామాల ప్రజలకు ప్రతి ఏటా వర్షాకాలంలో వారు పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. దశాబ్దాలుగా రోడ్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్నా తమ గోడును ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని వాపోతు న్నారు. కనీసం రోగమొస్తే వైద్యం కోసం కూడా వెళ్లలేని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు. గర్భిణు లు ప్రసవం కోసం వెళ్లాలన్నా కనీసం 108వాహనం కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని చెబుతు న్నారు. గామాల మద్య రెండు లోలెవల్ వంతెన లపై హైలెవల్ వంతెనలు లేక వాగు ఉప్పొం గినప్పుడల్లా రోజుల తరబడి రాకపోకలకు అంత రాయం ఏర్పడుతోందని ఆవేదన చెందుతున్నారు.
లింగాపూర్, (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు బురదమయంగా మార డంతో వాహనాలు కూరుకుపోతున్నాయి. ఇటీవల పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లే ఆటో బురదలో కూరుకుపోయింది. దీంతో విద్యార్థులు, స్థానికులు అతి కష్టంపై దాన్ని బయటకు లాగారు. మండలం లోని చిన్నదంపూర్ గ్రామ పంచాయతిలో గల పూల్‌సింగ్‌తండా, కిమానాయక్ తండా గ్రామాల పరిధిలో సుమారు 50 మంది విద్యార్థులు నిత్యం విద్యాభ్యాసం కోసం లింగాపూర్ మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఆయా గ్రామాల పరిధి లో తారు రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. దీంతో మట్టి రోడ్లపైనే వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వర్షం కురిసి రోడ్లపై వరదనీరు చేరితో వాహనాల రాకపోకలకు గుంతలు పడుతున్నాయి. వర్షం నీరు ఇంకిపోయినా బురదగా మారిన రోడ్లపై చిన్న వహనాలు కూరుకుపోతున్నాయి. పూల్‌సింగ్‌తండా, కిమానాయక్‌తం డా నుంచి లింగాపూర్ మండల కేద్రం సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇందులో 6 కిలోమీటర్లు మేర బురద రోడ్డే ఉంది. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.