Share News

Affordable Medicines: అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో జనరిక్‌ మెడికల్‌ షాపులు

ABN , Publish Date - Sep 15 , 2025 | 05:35 AM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనరిక్‌ మందుల షాపులను ఏర్పాటు చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది..

Affordable Medicines: అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో జనరిక్‌ మెడికల్‌ షాపులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనరిక్‌ మందుల షాపులను ఏర్పాటు చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. వైద్య విద్య సంచాలకుడి (డీఎంఈ) పరిధిలోని బోధనాస్పత్రులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీపీపీ) కమిషనర్‌ పరిఽధిలోని ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. డీఎంఈ, టీవీవీపీ పరిఽధిలో మొత్తం 203 ఆస్పత్రులున్నాయి.వీటిలో ప్రస్తుతం 40సర్కారీ దవాఖానాల్లో మాత్రమే జనరిక్‌ మెడికల్‌ షాపులున్నాయి. మిగిలిన 163ఆస్పత్రుల్లో ఈ ఏడాది నవంబరు నాటికి జనరిక్‌ మెడికల్‌ షాపులను అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో వైద్య ఆరోగ్యశాఖ ఉంది. ఇటీవలే ఆ శాఖ అధికారులు వీటి ఏర్పాటుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వరంగల్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జనగాం, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, వికారాబాద్‌ జిల్లాల్లోని సర్కారీ దవాఖానాల్లో ఒక్క జనరిక్‌ మెడికల్‌ షాపు కూడా లేదని గుర్తించారు. తొలి ప్రాధాన్యంగా ఆయా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటనే జనరిక్‌ మెడికల్‌ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ బాధ్యతను టీజీఎంఎ్‌సఐడీసీకి అప్పగించారు. కాగా, ప్రస్తుతం ఉన్న 40 జనరిక్‌ షాపుల పనితీరుపై ఇటీవల రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. వాటిల్లో నిబంధనల మేరకు జనరిక్‌ ఔషధాలే విక్రయిస్తున్నారా?లేక ఇతర బ్రాండ్ల మందులు అమ్ముతున్నారా? అనే అంశాలతోపాటు.. రోగులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ల అభిప్రాయాలను కమిటీ సేకరించింది. ఆ వివరాలతో ఇటీవలే వైద్యశాఖకు ఒక నివేదిక అందించింది. వీటిలో పనితీరు సరిగాలేని, ఇప్పటికే ఉన్న అగ్రిమెంట్‌ పూర్తి అయిన సంస్థలను తొలగించాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇక కొత్త దుకాణాల విషయానికి వస్తే.. రోగుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తారు. మెడికల్‌ షాపుల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లే నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. విశ్వసనీయత ఉన్న ఎన్‌జీవోలు, జిల్లా సమాఖ్యలు, మండల సమాఖ్యల్లో అర్హతగలిగిన వారికి షాపులను కేటాయిస్తారు.

ఆ షాపులు కొన్ని మూత..

ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధీ పరియోజన(పీఎంబీజేపీ)లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనరిక్‌ మెడికల్‌ షాపులను ఉన్నాయి. అయితే ఆ దుకాణాలకు వచ్చే ఔషధాలు ప్రతినెలా మారుతున్నాయని, ఒక్కసారి వచ్చిన ఔషధాలు మరో నెల్లో రావడం లేదని ఖమ్మం జిల్లాకు చెందిన షేర్‌ ఎన్‌జీవో వ్యవస్థాపకుడు గోపాల్‌రెడ్డి తెలిపారు. రోగులు ఒక్కసారి వాడిన ఔషధాలనే మళ్లీమళ్లీ అడుగుతుంటారని.. అలా రాకపోవడంతో పీఎంబీజేపీ కింద ఏర్పాటైన జనరిక్‌ షాపుల్లో కొనుగోళ్లు లేక కొన్ని మూతపడినట్లు వెల్లడించారు.


500 సర్కారీ బడుల్లో ఏఐ కోర్సు

తెలంగాణలోని స్టార్ట్‌పలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కీలక ఒప్పందం చేసుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఓపెన్‌ అగ్రికల్చర్‌ నెట్‌వర్క్‌ ద్వారా రైతులకు పలు సమస్యలకు పరిష్కారం అందించనుంది. రవాణా రంగంలో ఏఐ ఆధారిత వ్యవస్థతో వాహన సమాచారాన్ని తెలుసుకోవడం, డేటా ఇంటిగ్రేషన్‌ సదుపాయాలను వంటి చర్యలు చేపట్టనుంది. గూగుల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ను చేపడతారు. గూగుల్‌ ఓపెన్‌ డేటా యాక్సె్‌సను మెరుగుపరుస్తారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ లాంటి సంస్థలతోనూ పలు రంగాల్లో సాంకేతికతను వినియోగించడం కోసం ఒప్పందాలు చేసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 1.20 లక్షల మందికి ఏఐలో శిక్షణను ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే ప్రకటించింది. ‘ఏఐ తెలంగాణ ప్రోగ్రాం’ పేరుతో 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోర్సును పరిచయం చేయనున్నారు. దీంతో 50 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఏఐ ఇండస్ట్రీ పేరుతో పరిశ్రమలకు నైపుణ్యాలను, ఏఐ గవర్నెన్స్‌ పేరుతో దాదాపు 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు సైబర్‌ సెక్యూరిటీ వంటి కీలకమైన అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది. స్టార్టప్‌లకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో త్వరలో తెలంగాణ నవకల్పనలు, స్టార్ట్‌పలకు కేంద్రంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Sep 15 , 2025 | 05:47 AM