kumaram bheem asifabad- పనిచేయని జనరేటర్లు
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:06 PM
విద్యుత్ కోతల సమయంలో కార్యాలయాల్లో పనులకు ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు అందజేసి న జనరేటర్లు పని చేయడం లేదు. పనులు దక్కిం చుకున్న గుత్తేదారు ఆయా కార్యాలయాలకు జనరేటర్లు అప్పగించి చేతులు దులుపుకున్నారు.
- సిబ్బందికి తప్పని ఇబ్బందులు
- పట్టించుకోని ఉన్నతాధికారులు
వాంకిడి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ కోతల సమయంలో కార్యాలయాల్లో పనులకు ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు అందజేసి న జనరేటర్లు పని చేయడం లేదు. పనులు దక్కిం చుకున్న గుత్తేదారు ఆయా కార్యాలయాలకు జనరేటర్లు అప్పగించి చేతులు దులుపుకున్నారు. అధికార యంత్రాంగం సైతం వీటిని వినియోగం లోకి తీసుకురాకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. కొన్ని కార్యాలయాల్లో యంత్రాలకు తుప్పు పట్టగా మరికొన్ని కార్యాలయాల్లో నిరుపయో గంగా మారాయి. దీంతో రూ. లక్షల ప్రజాధనం బూడిదలో పొసిన పన్నీరులా మారింది. వర్షాకాలం లో తరచూ విద్యుత్‌లో అంతరాయం కలుగుతూ గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఆన్‌లైన్ సమస్యల తో కార్యాలయంలో పనులు నిలిచి పోతున్నాయి. కొన్నేళ్ల నుంచి జనరేటర్లు నిరుపయోగంగా ఉన్నా ఉన్నతాధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహారి స్తున్నారనే విమర్శలున్నాయి.
- జిల్లా వ్యాప్తంగా నిరుపయోగం..
జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో పంపిణీ చేసి న జనరేటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. విద్యుత్ కోతల సమ యంలో కార్యాలయాల్లో పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుందని సిబ్బంది వాపోతున్నారు. జనరేటర్లు పనిచేయక నిరుపయోగంగా ఉండడంతో ఇన్వర్టర్లు ఏర్పాటు చేసినా ఆన్‌లైన్ పనులు ఎక్కువ కావడంతో అవి ఎక్కువ సేపు నిలవడంలేదు. జిల్లాలో మంజూరి అయిన ప్రతి కార్యాలయంలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జిల్లాలోని వాంకిడి, కౌటాల తదితర మండలలాల్లో ఏర్పాటు చేసిన జనరేటర్లు కార్యాలయాల బయట అలంకారప్రా యంగా మారాయి. పలు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన జనరేటర్లుకు కనీసం షెడ్డు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఎండకాలంలో ఎండుతూ వర్షా కాలంలో తడుస్తూ తుప్పుపట్టి పోయాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు కార్యా లయంలో అత్యవసర పనులు నిలిపో తున్నాయి. ప్రజలకు ధ్రువపత్రాలు సకాలంలో అందక ఇబ్బం దులకు గురికావాల్సిన పరిస్థితి నెలకొన్నది.
అత్యవసర సమయంలో..
అత్యవసర సమయంలో విద్యుత్ కోతలతో ఇంట ర్‌నెట్ సేవలు అందడంలేదు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు నిర్వహించే విడియో కాన్ఫరెన్స్ సమయంలో విద్యుత్ నిలిచిపోతే సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. జనరేటర్ నడి పించేందుకు డీజిల్, పర్యవేక్షణకు ఆపరేటర్, మర మ్మతులకు మేకానిక్‌లు అందుబాటులో ఉండాల్సి ఉంది. జనరేటర్ల నిర్వహణ కోసం ప్రభుత్వం ఆయా శాఖలకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో అధికారులు సొంతంగా ఖర్చులు వెచ్చించినా అవి వస్తాయో రావో తెలియని పరిస్థితి ఉందని చెబుతున్నారు.
ఇన్వర్టర్లతోనే పనులు..
కవిత, వాంకిడి తహసీల్దార్
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం ఏర్పడకుండా ఇన్వ ర్టర్లను ఏర్పాటు చేశాం. వీటితో కార్యాలయంలో పనులు చేసుకుంటున్నాం. అప్రకటిత కోతలు ఉంటే, ఇన్వర్టర్లు నిలిచిపోతే ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. జనరేటర్ల పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదించాం.
- మరమ్మతులు చేయించాలి..
బండె తుకారాం, వాంకిడి మాజీ సర్పంచ్
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన జనరే టర్లను ఉన్నతాధికారులు మరమ్మతులు చేయిం చాలి. లక్షల రూపాయలతో కార్యాలయాల్లో ఏర్పా టు చేసిన జనరేటర్లు నిరుపయోగంగా మారాయి. విద్యుత్‌లో అంతరాయం జరిగినప్పుడు ఆన్‌లైన్ పనులు సకాలంలో పూర్తి కావడంలేదు. దీంతో సిబ్బందితో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.