Ultra processed food: ప్యాకేజీ ఫుడ్డుకే జై...
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:30 AM
మనదేశంలో ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ఆధునిక టెక్నాలజీ, ఈ-కామర్స్ సంస్థల ప్రాబల్యం పెరుగుతుండటంతో ముఖ్యంగా జనరేషన్ జెడ్...
ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్ ఆహారంపై యువత మోజు
క్విక్ కామర్స్ ద్వారా నిత్యం కొనుగోళ్లు
277 జిల్లాల్లో లోకల్ సర్కిల్స్ సర్వే
హైదరాబాద్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మనదేశంలో ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ఆధునిక టెక్నాలజీ, ఈ-కామర్స్ సంస్థల ప్రాబల్యం పెరుగుతుండటంతో ముఖ్యంగా జనరేషన్-జెడ్ (జెన్-జెడ్)గా పిలుస్తున్న యువత సొంత ఇంటి ఆహారం తినటమే దాదాపు మానేశారని సర్వేలు చెబుతున్నాయి. వీరు నిత్యం ఆన్‌లైన్‌లోనే ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా ప్యాకేజ్డ్, అల్ర్టా-ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు (హెచ్‌ఎ్‌ఫఎ్‌సఎ్‌స) దట్టించిన ఆహార పదార్థాల వైపే వీరు మొగ్గు చూపుతున్నట్లు లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన తాజా సరేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 277 జిల్లాల్లో 24 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 63 శాతం మంది పురుషులు, 37 శాతం మంది మహిళలు ఉన్నారు. టైర్ -1 పట్టణాల నుంచి 48 శాతం, టైర్-2 పట్టణాల వారు 31 శాతం, మిగిలినవారు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నట్లు సర్వే సంస్థ పేర్కొంది. అమెజాన్ ఫ్రెష్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, బిగ్ బాస్కెట్, జియోమార్ట్, జెప్టో, బ్లింకిట్, ిస్విగ్గీ ఇన్‌స్టా మార్ట్, మిల్క్ బాస్కెట్ వాటిలో యాప్‌ల ద్వారా హెచ్‌ఎ్‌ఫఎ్‌సఎ్‌స ఆహార పదార్థాలు ఎంత శాతం అమ్ముడవుతున్నాయనే విషయాన్ని లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వే చేసింది. ఈ కామర్స్ సంస్థలు తమ వెబ్‌సైట్లలో ఎక్కువగా హెచ్‌ఎ్‌ఫఎ్‌సఎ్‌స, అలా్ట్ర ప్రాసెస్డ్ ఆహార పదార్థాలనే డిస్‌ప్లేలో పెడుతున్నాయి. ఒక సంస్థ 1,000 రకాల ఆహార ఉత్పత్తులను అమ్మకానికి ఉంచితే, అందులో 670 వరకు హెచ్‌ఎ్‌ఫఎ్‌సఎ్‌స, అలా్ట్ర ప్రాసెస్డ్ రకానివే ఉంటున్నట్లు సర్వేలో తేలింది. చాలా సంస్థల ఆహార పదార్థాల ఆన్‌లైన్ విక్రయాల్లో 50 శాతానికి పైగా ఈ రకానివే ఉంటున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. తాము విక్రయించే ప్రతి రెండు ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఒకటి జంక్- హెచ్‌ఎ్‌ఫఎ్‌సఎ్‌స- అలా్ట్ర ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటోందని ఒక సంస్థ తెలిపింది. ముఖ్యంగా బ్లింకిట్ తన ఆన్‌లైన్ ఆహార పదార్థాల డిస్‌ప్లేలో 62 శాతం, జెప్టో 58 శాతం, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌లో 54 శాతం, జియోమార్ట్‌లో 50 శాతం, బిగ్ బాస్కెట్‌లో 49 శాతం, మిల్క్ బాస్కెట్‌లో 48 శాతం, అమెజాన్ ఫ్రెష్‌లో 44 శాతం, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌లో 42 శాతం అలా్ట్ర ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు ఉంటున్నట్లు పేర్కొంది.
యువత చేతిలోనే ఫుడ్ ఆర్డర్స్ కీ!
చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో నాలుక తృప్తిపడే రుచులను క్షణాల్లో యువత ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ చేసే కుటుంబాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. తమ ఇంట్లో యువతే ఈ కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను క్రమం తప్పకుండా ఆర్డర్ పెడుతున్నారని ఆన్‌లైన్‌లో ఆహారం కొనుగోలు చేసే కుటుంబాల్లో 39 శాతం మంది చెప్పినట్లు ఆ సర్వే వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ఆన్‌లైన్ షాపింగ్ చేేస కుటుంబాల ఆహారపు కొనుగోలు అలవాట్లపై ఈ సర్వే సంస్థ దృష్టి సారించింది. కేవలం 10-20 నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ చేేస క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ కారణంగా యువతకు చిరుతిండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కొనుగోలు చేయడంపై మరింత ఆసక్తి పెరిగినట్లు గుర్తించారు.
అనారోగ్య సమస్యలు తప్పవు
జెన్-జెడ్ ఇలాంటి ఆహారానికి అలవాటు పడటం భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీేస ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత జబ్బుల వంటి జీవనశైలి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ-కామర్స్ సంస్థల ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ యువతను మరింత ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ ట్రెండ్‌ను నియంత్రించాలంటే ప్రభుత్వం, ఫుడ్ రెగ్యులేటరీ సంస్థలు (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో కొవ్వు, చక్కెర, ఉప్పు ఎంతమేర ఉన్నాయో సూచించే వివరాలు స్పష్టంగా, పెద్ద అక్షరాలలో గుర్తుపట్టేలా ముద్రించాలని సూచిస్తున్నారు. దీనివల్ల వినియోగదారులు వాటిని కొనుగోలు చేేస ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆన్‌లైన్ సంస్థల్లో ఇలాంటి ఆహారం విక్రయాలపై కూడా కఠిన నిబంధనలు పెట్టాలని కోరుతున్నారు. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ఆహారాన్ని ప్రోత్సహించే ప్రకటనలు, డీల్స్‌పై ఆంక్షలు విధించడం, ఆరోగ్యకరమైన ఉత్పత్తులకు ప్రచారం కల్పించటం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అంతా అలా్ట్ర ప్రాసెస్డ్ ఫుడ్డే...
యువత ఆర్డర్ చేస్తున్న వాటిలో ఎక్కువగా అల్ర్టా-ప్రాసెస్డ్ ఆహారమే ఉంటున్నట్లు గుర్తించారు. పారిశ్రామికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను అలా్ట్ర ప్రాసెస్డ్ ఫుడ్‌గా పిలుస్తారు. ముఖ్యంగా వీటిలో ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్‌తోపాటు అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, కొవ్వులు ఉంటాయి. రెడీమేడ్ స్నాక్స్, చిప్స్, ప్యాకేజ్డ్ బిస్కెట్లు, శీతల పానీయాలు, కొన్ని రకాల ఇన్‌స్టంట్ నూడుల్స్ వంటివి ఈ కోవలోకి వస్తాయి. కాగా, ప్రతీ 10 కుటుంబాల్లో 9 ఆన్‌లైన్‌లో విక్రయించే ఆహార పదార్థాల్లో హెచ్‌ఎ్‌ఫఎస్‌ఎస్ ఆహారంపై రెడ్ సింబల్ పెడితే బాగుంటుందని, వాటిని కొనకుండా నిరోధించవచ్చని అభిప్రాయపడ్డాయి.