GCC Chairman Kotnack Tirupati: జీసీసీ అభివృద్ధికి 100 కోట్లతో ప్రతిపాదనలు
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:21 AM
గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అభివృద్ధికి రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలంగాణ గిరిజన కో ఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్...
డీఆర్ డిపోలకు కొత్త భవనాలు
బీఆర్‌ఎస్ హయాంలో నిర్వీర్యం
అవకతవకల ఆరోపణలపై విచారణ.. రుజువైతే చర్యలు తప్పవు
జీసీఎ్‌ఫడీసీ చైర్మన్ కోట్నాక్ తిరుపతి
హైదరాబాద్, డిసెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అభివృద్ధికి రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలంగాణ గిరిజన కో ఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ (జీసీఎ్‌ఫడీసీ) చైర్మన్ కోట్నాక్ తిరుపతి తెలిపారు. అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడం, గిరి బ్రాండ్ ఉత్పత్తుల మార్కెటింగ్‌తో పాటు శిథిలావస్థలో ఉన్న డీఆర్ డిపోలకు కొత్త భవనాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అప్‌గ్రేడ్ చేసి వ్యాపారాన్ని మరింత విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఆఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన జీసీసీలు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్థికావృద్ధిలో పురోగతి సాధించినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్ 4 నియామకాల ద్వారా 65 మందిని సంస్థకు కేటాయించి సిబ్బంది కొరతను తీర్చామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, ఐఆర్‌లను మంజూరు చేయడమే కాకుండా, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు కల్పించి, సిబ్బందికి నూరు శాతం వేతనాలు అందించినట్లు వెల్లడించారు. జీసీసీ అధికారులు, ఉద్యోగుల అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతున్నదని, రుజువైతే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
లైఫ్ సైన్సెస్ డైరెక్టర్‌గా శక్తి నాగప్ప పదవీ కాలం పొడిగింపు
తెలంగాణ లైఫ్‌సైన్సెస్ విభాగం కార్యకలాపాలపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రం లైఫ్ సైన్సెస్ హబ్‌గా ఎదగడంలో కీలకపాత్ర పొషించిన ప్రస్తుత డైరెక్టర్ ్క్ష సీఈవో శక్తి ఎం.నాగప్ప పదవీకాలాన్ని పొడిగించారు. ఈ రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల వేగాన్ని, స్థిరత్వాన్ని కాపాడేందుకు ఆయనను 2026 మార్చి వరకు అదే బాధ్యతల్లో కొనసాగాలని మంత్రి సూచించారు. అదే సమయంలో, ఈ విభాగానికి తదుపరి డైరెక్టర్‌గా నియమితులైన సర్వేశ్ సింగ్ అప్పటివరకు వరకు శక్తి నాగప్పతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారని తెలిపారు.