Share News

గణపతి నవరాత్రులను సామరస్యంగా జరుపుకోవాలి

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:11 PM

వినాయక చవితిని పురస్కరించుకుని గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా సామరస్యంతో జరుపుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

గణపతి నవరాత్రులను సామరస్యంగా జరుపుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌కుమార్‌దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : వినాయక చవితిని పురస్కరించుకుని గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా సామరస్యంతో జరుపుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వినాయక మండపాల ఏర్పాటు కోసం పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలని, అనుమతి ఉన్న మండపాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు. విద్యుత్‌ లైన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్దమండపాలను ఏర్పాటు చేయవద్దన్నా రు. విద్యుత్‌ సిబ్బందితో వైరింగ్‌ తనిఖీ చేయించుకోవాలని, ఇందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌ 1912లో సంప్రదించాలన్నారు. అగ్ని ప్రమాదాలతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. నిమ జ్జనం రోజు ఆబ్కారీ మధ్య నిషేధ శాఖ ఆధ్వర్యంలో డ్రైడే నిర్వహించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యు లు, సిబ్బంది,అంబులెన్స్‌ అందుబాటులో ఉంచాలన్నారు. మున్సిపల్‌,పంచాయతీల ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను చేపట్టాలని, గోదావరి వద్ద గజ ఈతగాల్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందారం సమీపంలోని గోదావరి వంతెన వద్ద సింగరేణి ఆధ్వర్యంలో నిమజ్జనానికి లైట్లు, క్రేన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్‌, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 11:11 PM