Gangi Shetty: బాల సాహిత్య పురస్కారం అందుకున్న గంగిశెట్టి
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:57 AM
నెల్లూరుకు చెందిన బాలల సాహితీవేత్త, రిటైర్డు ఉపాధ్యాయులు గంగిశెట్టి శివకుమార్ 2025 సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు...
న్యూఢిల్లీ, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): నెల్లూరుకు చెందిన బాలల సాహితీవేత్త, రిటైర్డు ఉపాధ్యాయులు గంగిశెట్టి శివకుమార్ 2025 సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. తెలుగులో. ఆయన రాసిన ‘కబుర్ల దేవత’ పుస్తకాన్ని 2025 బాల సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసినట్లు సాహిత్య అకాడమీ ఈ ఏడాది జూన్‌లో ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం, ఇక్కడి త్రివేణి కళా సంఘంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్.. శివకుమార్‌కు పురస్కారాన్ని అందజేశారు. ‘కబుర్ల దేవత’ పుస్తకం పిల్లల్లో మానవతా విలువలు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా రాసిన 36 కథల సంకలనం. వినోదాత్మకంగా కూడా ఉంటుంది.