Share News

పదే పదే నేరాలకు పాల్పడినవారిపై గ్యాంగ్‌ ఫైల్‌ ఓపెన్‌ చేయాలి

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:41 PM

పదే పదే నేరాలకు పాల్పడినవారిపై గ్యాంగ్‌ ఫై ల్‌ ఓపెన్‌ చేయాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. రామగుండం పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో మంచిర్యాల జోన్‌, పెద్దపల్లి పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

పదే పదే నేరాలకు పాల్పడినవారిపై గ్యాంగ్‌ ఫైల్‌ ఓపెన్‌ చేయాలి
సీఐ రాజుకుమార్‌కు రివార్డు అందజేస్తున్న రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ఝా

గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా

మంచిర్యాలక్రైం, ఆగస్టు22 (ఆంధ్రజ్యోతి): పదే పదే నేరాలకు పాల్పడినవారిపై గ్యాంగ్‌ ఫై ల్‌ ఓపెన్‌ చేయాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. రామగుండం పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో మంచిర్యాల జోన్‌, పెద్దపల్లి పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జోన్ల వారిగా స్టేషన్‌ డివిజన్లవారిగా పెండింగ్‌లో ఉన్న కేసుల కు సంబంధించి నేరస్తుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జీషీట్లకు సంబంధించి ప్రస్తుత కేసులస్థితి గతులపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పాటు శాస్ర్తీయ పద్ధతిని కూడాఅనుకరిస్తూ దర్యాప్తును చేపట్టాలని సూచించారు పెండింగ్‌లో ఉన్న కేసుల ను త్వరిగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సైబర్‌ క్రైం అనేది ఒక పెద్ద సమస్య అని సైబర్‌ క్రైంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్ప డిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేక టీంలు ఏ ర్పాటు చేయాలన్నారు. రామగుండం పోలీసు కమిషనర్‌ పరిధిలో 2025లో ఇప్పటి వరకు గంజాయి అక్రమ రవాణ, ప్రత్యేక నిఘా, ఇన్‌ఫర్‌మేషన్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని, పెద్దపల్లి జోన్‌ పరిధిలో 34 కేసులలో 98 మందిని అరెస్టు చేసి 157.102 కిలోల గంజాయి సీజ్‌ చేసి నట్లు తెలిపారు. మంచిర్యాల జోన్‌ పరిధిలో 34 కేసులలో 98 మందిని అరెస్టు, 34.541 కిలో ల గంజాయిని సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ కేసులలో నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సిబ్బందికి సీపీ చేతుల మీదుగా క్యాష్‌ రివార్డు అందించారు. వినాయక నవరాత్రి ఉ త్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విగ్రహా ల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో ముందుగానే సమావేశం ఏర్పాటు చేయాలని ఎ క్కడ శాంతిభద్రతలు తలెత్తకుండా చూడాలన్నారు.

పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తాం

పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తామని సీపీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. మంచి ర్యాల జోన్‌ రామకృష్ణాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తు మృతి చెందిన వెంకట్‌రెడ్డి కుటుంబానికి కుటుంబ సభ్యులకు ఆయన భద్రత చెక్కును అందజేశారు. ఎస్‌ఐ భార్య శ్రీలతకు భద్రత ఎక్స్‌గ్రేషియా రూపాయల 8లక్షల చెక్కును అందజేశారు. ఏసీపీ మల్లా రెడ్డి, ఏవో శ్రీనివాస్‌, రామగుండం పోలీసు కమిషనరేట్‌ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు బోర్ల కుంట బోజలింగం పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:41 PM