Share News

ATM Theft: ఏటీఎంలో రేకు పెట్టి.. డబ్బులు చోరీ!

ABN , Publish Date - Dec 29 , 2025 | 01:37 AM

ఏటీఎం మిషన్లలో వినియోగదారులు డబ్బు డ్రా చేస్తున్నప్పుడు వాళ్లకు తెలియకుండానే దొంగిలిస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు..

ATM Theft: ఏటీఎంలో రేకు పెట్టి.. డబ్బులు చోరీ!

  • కాజీపేటలో అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

వరంగల్‌ క్రైం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఏటీఎం మిషన్లలో వినియోగదారులు డబ్బు డ్రా చేస్తున్నప్పుడు వాళ్లకు తెలియకుండానే దొంగిలిస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5.10 లక్షల నగదు, 2 కార్లు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత ఆదివారం తెలిపారు. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాకు చెందిన ఆరి్‌ఫఖాన్‌, సర్ఫరాజ్‌, యం.ఆష్‌మహ్మద్‌, షాపుస్‌ ఖాన్‌, షారూఖ్‌ఖాన్‌, అస్లాంఖాన్‌, షారుఖావ్‌స సులభంగా డబ్బులు సంపాదించేందుకు పెట్రో ఏటీఎం మిషన్ల లోపాలను తెలుసుకున్నారు. నకిలీ తాళంతో ఏటీఎంల ముందు భాగం తెరిచి డబ్బులు బయటికి వచ్చే మార్గంలో ఓ ఇనుప ప్లేటును అమర్చేవారు. దీంతో ఖాతాదారులు డ్రా చేసుకునే సమయంలో డబ్బు బయటకి రాకుండా మిషన్‌లోనే నిలిచిపోయేది. అనంతరం ఖాతాదారుడు ఏటీఎం సెంటర్‌ బయటికి వెళ్లగానే ఈ ముఠా సభ్యులు మిషన్‌ తెరిచి డబ్బులు తీసుకునేవారు. ఇలా రాజస్థాన్‌లోని పలు ఏటీఎంలలో చోరీలకు పాల్పడ్డారు. బ్యాంకు అధికారులు అప్రమత్తం కావడంతో అక్కడ చోరీలకు బ్రేకు పడింది. ఇదే తరహా చోరీలు చేసేందుకు నవంబరులో వరంగల్‌కు రెండు కార్లలో వచ్చిన ఈ ముఠా సుబేదారి, హనుమకొండ, కాజీపేట, మిల్స్‌కాలనీ పోలీసుస్టేషన్ల పరిధిలో 7పెట్రో ఏటీఎం మిషన్లలో రూ.12.10 లక్షలు చోరీ చేశారు. బ్యాంకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీసీఎస్‌, కాజీపేట పోలీసులు.. ఆదివారం కాజీపేటలో ఈ ముఠాను పట్టుకున్నారు.

Updated Date - Dec 29 , 2025 | 01:37 AM