Share News

గంగమ్మ ఒడికి గణనాథులు

ABN , Publish Date - Sep 05 , 2025 | 11:34 PM

నస్పూ ర్‌లో నవరాత్రులు పూజలందుకున్న గణనాథులు శుక్ర వారం నిర్వహించిన నిమజ్జన శోభాయాత్ర ప్రశాం తంగా జరిగింది. నస్పూర్‌ ఏరియాలో దాదాపు 154 గణపతి మండపాలు ఏర్పాటు చేశారు.

గంగమ్మ ఒడికి గణనాథులు
గూడెంలో వినాయకుని క్రేన్‌ సహాయంతో నిమజ్జనం చేస్తున్న దృశ్యం.

గూడెం గోదావరి నదిలో వినాయకుల నిమజ్జనో త్సవం

గ్రామాల్లో ఉత్సహంగా శోభాయాత్రలు

నస్పూర్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : నస్పూ ర్‌లో నవరాత్రులు పూజలందుకున్న గణనాథులు శుక్ర వారం నిర్వహించిన నిమజ్జన శోభాయాత్ర ప్రశాం తంగా జరిగింది. నస్పూర్‌ ఏరియాలో దాదాపు 154 గణపతి మండపాలు ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజు ల పాటు ఆయా ప్రాంతాల్లో భక్తుల సందడితో పూజ లందుకున్న గణపయ్యలు నిమజ్జనానికి పయణ మ య్యారు. సీసీసీ కార్నర్‌ వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జనానికి వెళుతున్న గణపయ్యకు స్వాగతం పలికారు. అనంతరం గణనాథులు గోదావరి నదికి నిమజ్జనం కోసం తరలివెళ్లాయి. నిమజ్జన శోభా యాత్ర సందర్భంగా నస్పూర్‌ ఎస్సై ఉపేందర్‌రావు ఆ ధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

దండేపల్లి : మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జనం అట్టహాసంగా సాగింది. గణనాథులు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరాడు. ఊరురా గణనా థులను శోభాయాత్రగా తీసుకేళ్లి గూడెం గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. వేడుకలను దండేపల్లి ఎం పీడీవో ప్రసాద్‌, డీటీ మాధవి, లక్షెట్టిపేట సీఐ రమ ణామూర్తి, ఎస్సైలు తహసినోద్దీన్‌, గోపతి సురేష్‌, ఎం పీవో రామ్‌ప్రసాద్‌, పర్యవేక్షించారు.

మందమర్రిరూరల్‌ : మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వి నాయక విగ్రహాలతో..

(5వ పేజీ తరువాయి)

శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గోదావరి నదిలో గణనాథులను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

కాసిపేట : తొమ్మిది రోజుల పాటు పూజలందు కున్న గణపతి ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. సో మగూడెం,దుబ్బగూడెం, కాసిపేట, ముత్యంపల్లి, దే వాపూర్‌, మల్కేలపల్లి, ధర్మారావుపేట గ్రామాల్లో గణే ష్‌నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. గణనాథుని శోభా యాత్రను ఆట పాటలతో నిర్వహించి స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. కాసిపేట, దేవాపూర్‌ పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

భీమారం : మండలంలో వినాయక నిమజ్జన వే డుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మండల కేం ద్రంలో బస్టాండ్‌ మీదుగా శోభాయాత్ర కొనసాగింది. వినాయక మండపాల వద్ద లడ్డు వేలం పాటలను ని ర్వహించారు. భీమారం ఎస్‌ఐ శ్వేత ఆధ్వర్యంలో పో లీసులు బందోబస్తు నిర్వహించారు.

బెల్లంపల్లి: పట్టణంతోపాటు మండలంలో శుక్ర వారం వినాయక విగ్రహాలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. పురవీధుల్లో శోభయా త్ర నిర్వహించారు. భక్తులు శోభయాత్రలో నృత్యాలు చేశారు. అనంతరం విగ్రహాలను పోచమ్మ చెరువు వ ద్దకు తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. బెల్లం పల్లి ఏసీపీ రవి కుమార్‌ ఆధ్వర్యంలో సబ్‌ డివిజన్‌ లోని పోలీసులతో పాటు ఏఆర్‌ సిబ్బంది భారీ బందో బస్తు నిర్వహించారు.

మందమర్రిటౌన్‌ : పట్టణంలో శుక్రవారం నిమ జ్జనం సందర్భంగా గణనాధుల శోభాయాత్రను భక్తు లు ఘనంగా నిర్వహించారు. గణనాథులకు ఉద్వాసన పూజలు నిర్వహించారు. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి వద్ద వేదికను ఏర్పా టు చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి నల్లాల భాగ్యలక్ష్మీ శోభాయాత్రలో పాల్గొ న్నారు. మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి వినాయకునికి కొ బ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు. గణనాథులను మండపాల నిర్వహకులు నిమజ్జనం చేశారు. సీఐ శశి ధర్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌ల ఆధ్వర్యంలో పోలీసులు బం దోబస్తు నిర్వహించారు. హిందూ ఉత్సవ కమిటీ స భ్యులు సూరిబాబు, సుదర్శన్‌ పాల్గొన్నారు.

కన్నెపల్లి : మండపాల్లో ప్రతిష్టించిన గణనా థులకు ఉద్వాసన పూజలు చేసి గ్రామాల్లో శోభా యాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక చెరు వుల్లో నిమజ్జనం చేశారు. ఎస్‌ఐ భాస్కర్‌రావు ఆధ్వ ర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

లక్షెట్టిపేట: పట్టణంలో వినాయకుడి నిమజ్జన వేడుకలు శోభాయమానంగా జరిగాయి. భక్తిశ్రద్ధల తో గణనాథులను ఊరేగించి నిమజ్జనం చేశారు.

జైపూర్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో శు క్రవారం వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వ హించారు. వినాయక విగ్రహాలతో గ్రామాల్లో శోభా యాత్ర నిర్వహించారు. అనంతరం ఇందారం గోదా వరి నదిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

రామకృష్ణాపూర్‌: పట్టణంలోని కొలువుదీరిన గణనాథులను శుక్రవారం నిమజ్జనానికి తరలించా రు. ఆటపాటలతో ఉత్సాహంగా సాగారు. శోభా యాత్రలో బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్‌, మంద మర్రి సీఐ శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 11:34 PM