వినాయక నిమజ్జనం శాంతియుతంగా జరగాలి
ABN , Publish Date - Sep 03 , 2025 | 11:23 PM
వినాయక ని మజ్జనం శాంతియుతంగా, ఆ నందోత్సావాలతో భక్తులు జరు పుకునేందుకు అధికారులు సూ చించిన మార్గదర్శకాలను తప్ప నిసరిగా పాటించాలని కలెక్టర్ బ దావత్ సంతోష్ కోరారు.
- ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : వినాయక ని మజ్జనం శాంతియుతంగా, ఆ నందోత్సావాలతో భక్తులు జరు పుకునేందుకు అధికారులు సూ చించిన మార్గదర్శకాలను తప్ప నిసరిగా పాటించాలని కలెక్టర్ బ దావత్ సంతోష్ కోరారు. బుధ వారం నాగనూల్ చెరువు వద్ద ని మజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇ బ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తు న్నట్లు తెలిపారు. ఆర్డీవో సురేష్ బాబు, డీఎస్పీ శ్రీనివాసులు, మునిసిపల్ కమిషనర్ నాగిరెడ్డి, తహసీల్దార్ తబితారాణి ఉన్నారు.
నెల రోజుల్లో భూ సేకరణ పూర్తి చేయాలి
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేప ట్టనున్న రైల్వే, రహదారులు, నీటిపారుదల ప్రా జెక్టుల కోసం భూసేకరణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాజీవ్ భీమాలిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల పరిధిలో 142.98 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 129.52 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించినట్లు తెలిపారు. ఇంకా 18.48 ఎకరాల భూమిని రానున్న నెలరోజుల్లో సేకరణ ను పూర్తిచేసి ప్రాజెక్టు నిర్మాణానికి అందజేసే లా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుం టుం దని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులకు కలెక్టర్ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ పాల్గొన్నారు.
స్థానిక సంస్థల తుది జాబితా విడుదల
స్థానిక సంస్థల ఓటర్ల తుది జాబితా మంగ ళవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ప్రక టించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లాలో 460 గ్రామ పంచాయతీలు, 4,102 వార్డులు, 4,102పోలింగ్ కేంద్రాలు ఉన్నా యని, జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రకారం 6,47, 342 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 3,23,016 మంది పురుషులు, 3,24,315 మంది మహిళా ఓటర్లు, 11మంది ఇతరులు ఉన్నారని కలెక్టర్ తెలిపారు.